సమీర్ రిజ్వీ పైసా వసూల్ పర్ఫార్మెన్స్.. రూ.95 లక్షలకే జాక్‌పాట్ కొట్టేసిన ఢిల్లీ!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో అసలైన పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూయించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రిజ్వీ.. ఆ ఫ్రాంఛైజీ తరఫున అవకాశాలు వచ్చినా తనను తాను నిరూపించుకోలేకపోయాడు. సీఎస్కే రిలీజ్ చేసిన తర్వాత రిజ్వీ దశ తిరిగింది. ఐపీఎల్ 2025లో ఒకరకమైన ప్లాట్‌ఫామ్ వేసుకున్న రిజ్వీ.. ఈ ఏడాది ఆరంభ మ్యాచ్‌లో పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రిజ్వీ 51 పరుగులు మాత్రమే చేయడంతో.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిలీజ్ చేసింది. ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 95 లక్షలకే ఎగరేసుకుంది. ఢిల్లీలో మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఐదు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇచ్చింది. 58 నాటౌట్‌తో మెరిసి 121 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో తనను తాను నిరూపించుకున్న రిజ్వీకి ఢిల్లీ ఈ ఏడాది మొదటి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. టాప్ ఆర్డర్ అంతా విఫలమవ్వడంతో.. మిడిలార్డర్‌లో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ వికెట్లను కాపాడటమే కాకుండా మ్యాచ్ విన్నర్‌గానూ నిలిచాడు. ఢిల్లీ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రిజ్వీ ఆఖరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌ని గెలిపించాడు. 47 బంతులు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రిజ్వీతో పాటు ట్రిస్టన్ స్టబ్స్ కూడా 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని, లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. హోం గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో తేలిపోయింది. గజిబిజిగా ఉన్న బ్యాటింగ్ ఆర్డర్‌తో 18.4 ఓవర్లలోనే 141 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో తరఫున అబ్దుల్ సమ్మద్ 36, మిచెల్ మార్ష్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే దెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం.. ఆ వెంటనే నితీష్ రాణా, పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ అక్షర్ పటేల్ అవుటవ్వడంతో 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వి - ట్రిస్టన్ స్టబ్స్ మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని గెలిపించారు. ఈ ఇద్దరూ 76 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 17.1 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించారు.