: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్ 1 తో 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. దీంతో పన్ను చెల్లింపుదారుల సమయం మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 లేదా అసెస్మెంట్ ఇయర్ 2026-27 లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పుడే ఆదాయపు పన్ను విభాగం.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవసరమైన ఫారాల్ని నోటిఫై చేసింది. ఇక్కడ చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారుల్ని ఉద్దేశించినటువంటి ఐటీఆర్- 1, 4 ఫారాల్ని మార్చి 30 నే నోటిఫై చేయగా.. ఐటీఆర్ - 2, 3, 5, 6, 7 సహా ఐటీఆర్- U (అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్),, ఐటీఆర్- V (వెరిఫైడ్ రిటర్న్స్) ఫారాల్ని మంగళవారం రోజు నోటిఫై చేసింది. >> ఆడిట్ అవసరం లేనటువంటి వారు.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆఖరి తేదీ జులై 31 గా ఉంది. ఆడిట్ అవసరమైన వాటికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసేందుకు లాస్డ్ టేట్ ఉంది. ఏ ఫారాలు ఎవరి కోసం అంటే?ఐటీఆర్ ఫారం- 1 (సహజ్), ఐటీఆర్ -4 (సుగమ్) ఫారాలు చిన్న, మధ్య తరహా టాక్స్ పేయర్ల కోసం ఉద్దేశించినవి అని చెప్పొచ్చు. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉన్నవారు.. ఐటీఆర్- 1 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఆదాయం, జీతం వచ్చేవారు, ఇతర రూపాల్లో (వడ్డీ) ఆదాయం ఉన్న వారు, సంవత్సరానికి రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న వ్యక్తులు సహజ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షలకు మించి ఉన్న వారు.. వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), సంస్థలు వంటివి సుగమ్ ఫారం ఎంచుకోవచ్చు. ఐటీఆర్- 2 -- మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్- 2 ఎంచుకోవచ్చు. వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించిన వారికి ఇది వర్తించదని గుర్తుంచుకోవాలి.ఐటీఆర్- 3 అనేది వృత్తి లేదా ఇతర వ్యాపారాల ద్వారా ఆర్జించే వ్యక్తులు, HUF ల కోసం ఈ ఐటీఆర్ ఫారం తెచ్చారు. ఐటీఆర్- 5 సంస్థలు, సహకార సంఘాలు సహా LLP లు దాఖలు చేయాలి. ఐటీఆర్- 6 - ఇది కంపెనీల చట్టం కింద నమోదు చేసుకున్న కంపెనీలు ఎంపిక చేసుకోవాలి. ఐటీఆర్- 7 స్వచ్చంధ సంస్థలు, ట్రస్టుల కోసం ఈ ఫారం అందుబాటులో ఉంది. ఐటీఆర్- U అనేది తమ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు.. ఏదైనా ఉంటుంది. ఇక్కడ పెనాల్టీ పడుతుంది. ఐటీఆర్- V అనేది సాధారణ వెరిఫికేషన్‌కు సంకేతం. ఐటీఆర్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేయాలన్నమాట.