కేరళలో బీజేపీ మేనిఫెస్టో... సీనియర్ సిటిజన్లకు రూ.3 వేలు, శబరిమలపై కీలక హామీ

Wait 5 sec.

కేరళ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో అధికార కమ్యూనిస్ట్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోడానికి పలు హామీలను గుప్పిస్తున్నాయి. తాజాగా, తన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఇందులో సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి ముఖ్యమైన వాగ్దానాలను పొందుపరిచింది. సీనియర్ సిటిజన్లకు రూ.3 వేల పెన్షన్, మహిళలకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు పథకంతో నెలకు రూ.2,500, పేదలుకు ఏడాదికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను మేనిఫెస్టోలో పేర్కొంది. తిరువనంతపురంలో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేరళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, ఇతన నాయకులు పాల్గొన్నారు. బీజేపీ సైతం ప్రజాకర్షక పథకాలతోనే మేనిఫెస్టోను నింపేయడం చెప్పుకోదగ్గ అంశం.సంక్షేమ పింఛన్ పథకం కింద పేద కుటుంబాల్లోని ఇంటి పెద్ద, వితంతువులు, 70 ఏళ్లు పైబడినవారికి నెలకు రూ.3,000 చొప్పున అందజేయనున్నట్టు వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు, పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ చేపడతామని తెలిపింది. ఓనం, క్రిస్మస్ పండుగల సమయంలో పేదలకు ఉచితంగా ఒక గ్యాస్ సిలెండర్ అందజేయనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, రైతులకు సంబంధించి అత్యవసర వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేపడతామని హామీ ఇచ్చింది. ఇక, పేద కుటుంబాల్లోని మహిళలకు ‘ఫుడ్ హెల్త్ సెక్యూరిటీ కార్డ్’ పథకం తీసుకొస్తామని, నిత్యావసరాలు, మందులు కొనుక్కునేందుకు ప్రతి నెల రూ.2,500 విలువ చేసే కార్డును అందిస్తామని పేర్కొంది. శబరిమల, గురవాయూర్ వంటి ప్రముఖ ఆలయాల పరిరక్షణ, నిర్వహణకు దేవస్థానం బోర్డుల్లో సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన ఎయిమ్స్ ఏర్పాటు, తిరువనంతపురం-కన్నూర్‌ మధ్య హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు వంటివి మేనిఫెస్టోలో బీజేపీ చేర్చింది.జరుగనున్న విషయం తెలిసిందే. మే 4న పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలతో కలిసి ఓట్లను లెక్కించి ఫలితాలు వెలువడతాయి. గత పదేళ్లుగా ఇక్కడ పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలతో యూడీఎఫ్ ప్రచారం సాగిస్తుంది. అలాగే, అధికార ఎల్డీఎఫ్ కూటమి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని హైలైట్ చేస్తోంది. ఇక, తృతీయ ప్రత్నామ్నాయ శక్తిగా తన ఉనికిని విస్తరించుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది.