పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని, అమెరికా వైదొలగగానే హర్ముజ్ జలసంధి దానంతట అదే తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు మంగళవారం ప్రకటించారు. ‘‘మేము అక్కడ ఎక్కువ కాలం ఉండబోం.. ప్రస్తుతం మేము వారిని పూర్తిగా నాశనం చేస్తున్నాం.. ఇది సంపూర్ణ నిర్మూలన. కానీ మేము అక్కడ ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు.. అయితే వారి మిగిలిన సామర్థ్యాన్ని అంతం చేసే విషయంలో మేం ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని ట్రంప్ న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి ముందు . తమకు సాయం చేయని వారికి.. తాము కూడా సహాయం చేయబోమని బెదిరింపులకు దిగారు. ఇంధనం కావాలనుకుంటే తమ దగ్గర కొనుగోలు చేయడమో లేకుంటే హర్మూజ్‌కు వెళ్లి తెచ్చుకోవాలని యూకే సహా ఇతర దేశాలపై ట్రంప్ చిందులు వేయడం గమనార్హం.ఇదిలా ఉండగా కూడా మరోవైపు వస్తున్నాయి. భారీగా అదనపు బలగాలను పశ్చిమాసియాకు అమెరికా పంపుతుందనే నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ చమురుకు ఆధారమైన ఖర్గ్ దీవులపై దాడులకు ప్రణాళిక వేసినట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ సైతం భూతలంలో అమెరికాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇలాంటి తరుణంలో హర్మూజ్ జల సంధిలో ప్రయాణించే నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ భద్రత కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. అంతర్జాతీయ జలమార్గాలపై అజమాయిషీ, రుసుంలు వసూలు చేసే అధికారం ఎవ్వరికీ ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు, యుద్ధంలోకి హౌతీలు ప్రవేశించడంతో మరింత తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎర్ర సముద్రంలో నౌకలను వారు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని, అలాగే బాబ్ ఎల్ మండేబ్ జల సంధికి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపుపై ట్రంప్ నుంచి సంకేతాలు రావడం కొంత శుభపరిణామమే.