56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు.. 48 గంటల్లో వాట్సాప్‌లో రిపోర్టులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

Wait 5 sec.

తీసుకుంది. ఈ ఏడాది జూలై నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకం అమలు చేయాలని నిర్ణయించింది. నారా చంద్రబాబు నాయుడు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని సూచించారు. ఏప్రిల్ నుంచి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అలాగే ప్రతి నెలా నాలుగో శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో.. గ్రామసభలు, ఆరోగ్య శిబిరాలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. అక్కడ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో జూలైనాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే 2027 నాటికి రాష్ట్రంలోని 56.40 లక్షల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షల తర్వాత వాటి ఫలితాలను 48 గంటల్లోగా వారికి వాట్సప్ ద్వారా అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు గానూ.. రూ.162 కోట్లు విడుదల చేసేందుకు చంద్రబాబు అంగీకరించారు.ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది ప్రజలు సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హెల్త్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు. రాబోయే రోజులలో ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా సేవలు అందించాలని, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ పాలసీపై సమీక్షమరోవైపు రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ పాలసీపైనా చంద్రబాబు సమీక్షించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేయనున్నారు. ఇందులో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకొస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే సమయంలో వైద్యారోగ్య శాఖలో ఖాళీపైనా చంద్రబాబు చర్చించారు. రేషనలైజేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే అనారోగ్య సమస్యలు, అత్యవసరవ వైద్య పరిస్థితులు, డాక్టర్ల సూచనల మేరకే గర్భిణులకు సిజేరియన్లు చేయాలని, నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.