ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఈ 4 పన్ను మినహాయింపులు పెంపు.. హైదరాబాద్‌లో ఉంటే అదనపు బెనిఫిట్

Wait 5 sec.

: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బిగి రిలీఫ్ కల్పించింది కేంద్రం. పన్ను మినహాయింపులు పొందే అలవెన్సుల పరిమితులను భారీగా పెంచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పన్ను నియమావళి 2026లో కీలక మార్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్ పన్ను మినహాయింపు, పిల్లల ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, గిఫ్ట్స్ వంటివాటిపై మినహాయింపుల పరిమితిని పలు రెట్లు పెంచారు. దీంతో శాలరీడ్ ట్యాక్స్ పేయర్లు ప్రతి ఏటా భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లభించింది. అయితే, అది పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఎంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మరి ఏ పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు పొందవచ్చు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాత పన్ను విధానం ఎంచుకుంటేపాత పన్ను విధానంలో చాలా రకాల పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త మార్పుల్లో ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) క్లెయిమ్ ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే మరో 4 నగరాలకు మెట్రో హోదా కల్పించారు. హైదరాబాద్, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌ను ఈ జాబితాలో చేర్చారు. దీంతో ఆయా పట్టణాల్లోని ఉద్యోగులు ఇకపై . ప్రస్తుతం ఈ పరిమితి 40 శాతంగా ఉంది. దీనిపై మరో 10 శాతం అదనంగా క్లెయిమ్ చేసుకునే వీలు లభించింది. అలాగే పాత పన్ను విధానంలో లభించే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజు మినహాయింపు పరిమితి ప్రస్తుతం నెలకు రూ.100గా ఉంది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి దీనిని నెలకు రూ.3000లకు పెంచారు. దీంతో పాటుగా చిల్డ్రన్ హాస్టల్ ఖర్చులపై మినహాయింపు పరిమితి ప్రస్తుతం నెలకు రూ.300 ఉండగా ఏకంగా నెలకు రూ.9000లకు పెంచారు. అంటే పిల్లల చదువుల ఖర్చులపై నెలకు రూ.12 వేల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త పన్ను విధానం ఎంచుకుంటేకొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి పన్ను మినహాయింపులు దాదాపుగా లేవనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం ఈ పరిమితి ఏడాదికి రూ.5000గా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరిమితిని రూ.15000గా చేశారు. అలాగే పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి సైతం ఈ లిమిట్ వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే రెండు విధానాల్లోనూ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.