బాలయ్య, రాజశేఖర్‌‌ పక్కన కూతురుగా చేసి పెద్దయ్యాక గర్ల్ ఫ్రెండ్స్‌గా నటించా.. ఫీలింగ్స్ ఎలా వస్తాయ్: హీరోయిన్ రాశి

Wait 5 sec.

‘‘ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. రిలేషన్ షిప్‌ని కూడా వ్యాపారంలాగే చూస్తున్నారు. నీ జీతం ఎంత.. నా జీతం ఎంత.. నీకు ఎంత సంపాదన.. నాకు ఎంత సంపాదన.. ప్రతిదానికి రూల్స్ పెట్టేసుకుంటున్నారు. నేను నిన్ను చూశా కాబట్టి నన్ను చూడాలంటే అనుబంధాలు దూరం అయిపోతాయి కదా.. నేను ఇలాంటి బంధాలకు దూరంగా ఉంటాను’’ అంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు . ఒక ఆర్టిస్ట్.. ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నేను ఓ హీరోతో రొమాంటిక్ సీన్ చేస్తుండొచ్చు. అది కేవలం యాక్టింగ్ మాత్రమే. కానీ ఈ వ్యక్తి అతన్ని చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తాయా? అది నిజమేనా? అని అడిగితే అది ఎంత టార్చర్‌గా ఉంటుంది. ఇవన్నీ నాలో మార్పు తీసుకుని వచ్చాయి. పెళ్లి విలువ ఏంటనేది నాకు తెలిసింది. ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి గొప్పదనం చెప్పారు. అవన్నీ నాలో మార్పు తీసుకుని వచ్చాయి.నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా లవ్వు గట్రాలేం లేవు. ఎందుకంటే నాకు అబ్బాయిలంటే భయం. నన్ను ఇష్టపడ్డ వాళ్లు ప్రపోజ్ చేశారు కానీ.. వాళ్లకి అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లకి పెళ్లై పెళ్లాలు ఉండి నాకు ప్రపోజ్ చేసేవారు. వాళ్లు అలా చేసినప్పుడు.. హో.. సారీ అని అనేసేదాన్ని. నన్ను నన్నుగా ఇష్టపడి వెంటపడిన సందర్భాలేం లేవు.నేను చాలామంది హీరోలతో పనిచేశాను. అమితాబ్ నుంచి కమల్ సార్ వరకూ పెద్ద పెద్ద అందగాళ్లని చూశాను. ఎవరూ నాకు అంతగా అనిపించలేదు. శ్రీకాంత్, జేడీ చక్రవర్తిలతో కలిసి పనిచేశా కాబట్టి.. కాస్త క్లోజ్‌నెస్ ఉండేది. అదే క్లోజ్ మిగిలిన హీరోలతో లేదు. బాలయ్య బాబుగారితో చిన్నప్పుడు ‘బాల గోపాలుడు’ చేశాను. పెద్దయ్యాక క్రిష్ణబాబులో హీరోయిన్‌గా చేశాను.. సెలబ్రేషన్స్‌కి వెళ్లేదాన్ని. రాజశేఖర్ గారితో మమతల కోవెలలో కూతురుగా చేశాను. హీరోయిన్‌గా ‘నేటి గాంధీ’ చేశాను. అప్పట్లో అంకుల్, డాడీ అని పిలిచి.. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌గా చేయాలంటే ఆ ఫీలింగ్ రాదు. కాబట్టి నాకు సినిమా అంటే సినిమా. యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే. నాకు ప్రపోజ్ చేసిన ఇద్దరు ముగ్గురు కూడా వాళ్లకి ఆల్రెడీ పెళ్లైన తరువాత చెప్పారు. అలాంటి వాళ్లని యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఆస్తి, అంతస్తు, అందం కంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ముఖ్యం. అందుకే వాటన్నింటినీ వద్దనుకుని మా ఆయన నివాస్‌ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ మాకు పెళ్లై 21 ఏళ్లు అవుతుంది.. హ్యాపీగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చింది .