Ola Electric: సరైన విక్రయాలు లేక సతమతమవుతున్న దిగ్గజ విద్యుత్తు టూ-వీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఓలా కంపెనీ మళ్లీ పుంజుకుంది. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున 1000 ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. మార్చి నెల మొత్తానికి గాను 10.117 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు వాహన్ డేటా ప్రకారం తెలుస్తోంది. ఫిబ్రవరి, 2026 నెలలో ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ల సంఖ్య కేవలం 3973 యూనిట్లగా ఉంది. దాంతో పోలిస్తే మార్చి నెలలో 150 శాతం వృద్ధి సాధించి మళ్లీ దిగ్గజ టూ-వీలర్ తయారీ కంపెనీలతో పోటీలోకి వచ్చేసింది. ల పట్ల వినియోగదారుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సాంప్రదాయ టూ-వీలర్ తయారీ కంపెనీలైన టీవీఎస్, బజాజ్ వంటివి ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీలోకి అడుగుపెట్టడం ఓలా కంపెనీకి దెబ్బ పడింది. మార్కెట్ వాటా పరంగా ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ తన వాటాను క్రమంగా కోల్పోతూ వచ్చింది. దేశవ్యాప్తంగా సర్వీస్ సెటర్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలోనే వందల షోరూములను మూసివేసినట్లు వార్తలు సైతం వచ్చాయి. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఓలా గట్టి ప్రయత్ననే చేసిందని చెప్పాలి. సర్వీసు సెంటర్లను విస్తరించడం, పనితీరును మెరుగుపరుచుకుని, సర్వీసింగుకు వచ్చే వాహనాల్లో దాదాపు 80 శాతం వరకు అదే రోజు పూర్తి చేసి డెలివరీ ఇస్తున్నామని ఓలా పేర్కొంది. స్పేర్ పార్టుల లభ్యత సైతం పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ పట్ల తమ కస్టమర్లలో విశ్వాసం పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టింది. పండగల సమయంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లనూ తీసుకొచ్చింది. ఓలా బేస్ మోడల్ స్కూటర్లను రూ.49,999లకే అందించింది. బ్యాటరీ ఆన్ రెంట్ ఆఫర్లనూ అందించింది. దేశంలోనే తొలి కంపెనీగా అవతరణధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తంగా 1 మిలియన్ అమ్మకాలు సాధించిన తొలి ఈవీ కంపెనీగా ఓలా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈవీ టూ-వీలర్ల విక్రయాల్లో పది లక్షల విక్రయాలు సాధించిన తొలి కంపెనీగా అవతరించడం తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఇదే పని తీరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.