కొత్త ఆర్థిక ఏడాది షురూ.. ఈ 10 పనులు చేయకపోతే మీ జేబుకు చిల్లే.. చూసుకోండి!

Wait 5 sec.

Financial Tasks: కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) . పాత ఏడాది జ్ఞానపకాలను పక్కన పెట్టి, కొత్త ఏడాదిని ఆర్థికంగా పటిష్ఠంగా ప్రారంభించాల్సిన తరుణం వచ్చింది. కొత్త ఏడాదిలో ఆర్థికంగా పటిష్ఠంగా ఉండాలంటే కేవలం పెంచుకుంటే సరిపోదు, సరైన ఆర్థిక ప్రణాళిక సైతం ఉండాలి. అందుకే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల నుంచి ఇన్వెస్ట్‌మెంటి డిక్లరేషన్ల వరకు మీరు వెంటనే పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అందులోని టాప్-10 ఫైనాన్షియల్ టాస్కుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పన్ను పరిధిలోకి వచ్చే ఉంద్యోగులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు కచ్చితంగా పూర్తి చేసే పనులు వెంటనే చేయడం మంచిది. 1.పన్ను విధానం డిక్లరేషన్ఆర్థిక ఏడాది 2026-27 ప్రారంభమైన క్రమంలో పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి తాము ఏ పన్ను విధానంలో ఉన్నామనేది తెలియజేయాలి. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. మీరు ఇచ్చే డిక్లరేషన్ ఆధారంగానే పేరోల్ టీమ్ మీ శాలరీపై టీడీఎస్ సరిగ్గా లెక్కించేందుకు వీలు కలుగుతుంది. ఒక వేళ మీరు ఏ నిర్ణయం వెల్లడించకపోతే ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం అమలు అవుతుంది. 2. పాత పన్ను విధానంలో పెట్టుబడుల డిక్లరేషన్మీరు పాత పన్ను విధానం ఎంచుకున్నట్లయితే పన్ను మినహాయింపులు పొందేందుకు మీ యాజమాన్యానికి పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడించాలి. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, బీమా ప్రీమియం, హోమ్ లోన్ వంటి వివరాలు ఉంటాయి. సరైన సమయానికి వివరాలు అందించడం ద్వారా నెలవారీ టీడీఎస్ తక్కువ పడేలా చూసుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ సైతం ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతుంది. 3. టర్మ్ ఇన్సూరెన్స్ మీకు అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. మీరు ఎంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ కడితే ప్రీమియ అంత మేర తక్కువగా ఉంటుంది. అలాగే మంచి కవరేజీ లభిస్తుంది. 4. హెల్త్ ఇన్సూరెన్స్పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండం అనేది అత్యవసరం. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఆర్థిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుంది. అందుకే జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మంచిది. 5. ఫారం 15జీ, 15హెచ్ సమర్పించడంపన్ను పరిధిలోకి రాను వారు ఫారం 15జీ లేదా 15హెచ్ సమర్పించడం ద్వారా వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పడకుండా చూసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి చేసే వారు ప్రతి సంవత్సరం ఈ ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 15హెచ్ ఉపయోగిస్తే, సాధారణ ప్రజలు 15జీ ఉపయోగించాల్సి ఉంటుంది. 6.పదవీ విరమణ ప్లాన్సమయంగా చెబుతారు. దీర్ఘ కాల పెట్టుబడి పథకాల కోసం కొంత డబ్బులు కేటాయించాలి. చిన్న వయసులోనే ప్రారంభిస్తే రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు అందుకునే వీలు కలుగుతుంది. 7.ఎస్‌టీపీ ట్రాన్స్‌ఫర్మీరు పదవీ విరమణకు దగ్గరల్లో ఉంటే మీ పెట్టుబడి ప్రోర్ట్‌ఫోలియేను రీబ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. మీ పోర్ట్‌ఫోలియోలోని ఈక్విటీ భాగాన్ని హైబ్రిడ్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ లేదా డెట్ పెట్టుబడులకు మార్చడం ఒక మంచి చొరవ కావచ్చు. మీ పెట్టుబడులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నట్లయితే, మీరు వాటిని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (STP) ద్వారా హైబ్రిడ్ లేదా డెట్ ఫండ్స్‌కు మార్చుకోవచ్చు.8. కేవైసీ అప్డేట్మీ పెట్టుబడులు, బ్యాంకు అకౌంట్లలో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసేందుకు మీరు తప్పనిసరిగా ఎలక్ట్రానికి కేవైసీ (e-KYC) ద్వారా అప్డేట్ చేయడం చాలా అవసరం. అడ్రస్, ఐడీ ప్రూఫ్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. 9.నామినేషన్ అప్డేట్మీ పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ అకౌంట్ల వంటి వాటిల్లో నామినీ వివరాలను అప్డేట్ చేయాలి. అలాగే నామినీ వివరాలను సరిగ్గా ఎంటర్ చేశామా లేదా అనేది సైతం చూసుకోవాలి. 10.సీనియర్ సిటిజన్ స్కీమ్స్మీరు 60 ఏళ్ల వయసు దాటినట్లయితే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాల్లో పెట్టుబడులను ప్రారంభించాలి. ప్రస్తుతం బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.