‘రామాయణ’ టీజర్‌ రిలీజ్‌.. శ్రీరాముడి అవతార్‌లో ఆకట్టుకున్న రణబీర్‌ కపూర్

Wait 5 sec.

రామాయణం ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘’ అనే టైటిల్ తో నమిత్ మల్హోత్రా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రావణుడిగా యష్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ అలరించగా.. నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా 'రామ' పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పట్టాభిషేకం, అరణ్యవాసం వంటి ఘట్టాలతో రూపొందించిన 'రామ' వీడియో అద్భుతంగా ఉంది. 2 నిమిషాల 38 సెకండ్ల వీడియోతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందని శాంపిల్ గా చూపించారు. మర్యాద పురుషోత్తముడుగా శ్రీరాముడి అవతార్ లో రణబీర్‌ కపూర్ ఆకట్టుకున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌ ఈ టీజర్‌కు హైలైట్‌ గా నిలిచాయి. సీత, రావణుడి పాత్రలను ఈ వీడియోలో చూపించలేదు. సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో ‘రామాయణ’ ప్రాజెక్ట్‌ రూపొందుతోంది. రామాయణ పార్ట్-1 మూవీని 2026 దీపావళికి విడుదల చేయనున్నారు, 2027 దీపావళికి పార్ట్-2 ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.