ఏపీలో ఆరు లైన్లతో కొత్త హైవే రెడీ.. ట్రయల్ రన్ పూర్తి.. పోర్టుకు గంటన్నరలోనే వెళ్లొచ్చు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి తమిళనాడును కనెక్ట్ చేసే.. చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ హైవేపైకి వాహనాలను అనునమతించారు. ఈ హైవేలో సుమారు 100 కి.మీ వేగంతో వెళితే దాదాపు గంటన్నరలోనే తమిళనాడుకు, పోర్టుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ఈ హైవేపైకి వాహనాలను పూరిస్థాయిలో అనుమతించనున్నారు.. టోల్ రుసుము వసూలు చేయనున్నారు. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు ఆరు లైన్లుగా ఉంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 95 కిలో మీటర్లు ఉంది.. మిగిలిన 21 కిలోమీటర్లు తమిళనాడులో ఉంది. చిత్తూరులోని మాపాక్షి దగ్గర ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది.. ఆ తర్వాత గంగాధర నెల్లూరు, ఎస్ఆర్‌పురం, నగరి మీదుగా కొనసాగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని ఎంటరై ఊతుకోట్టై వరకు.. మళ్లీ అక్కడి నుంచి కట్టుపల్లి పోర్టు వరకు హైవే ఉంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కర్ణాటక నుంచి వచ్చే భారీ వాహనాలు తమిళనాడులోని పోర్టుకు చేరుకునేందుకు వీలుగా నిర్మించారు. ఈ హైవేలో ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, శ్రీరంగరాజపురం, నగరి దగ్గర మాత్రమే ఉంటాయి. నగరి, ఎస్‌ఆర్‌పురం, అనుపల్లె, అరతల, నరసింహాపురం, పల్లిపట్టు, ఊతుకోట, కుమారరాజపేట, వీరకావేరిరాజపురం, పొందవాక్కం దగ్గర ఇంటర్ చేంజ్‌లు ఉంటాయి. ఈ హైవే దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. త్వరలోనే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి వాహనాలను అనుమతించనున్నారు. ఈ గచిత్తూరు- తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్ని 2022లో రూ.4వేల అంచనా వ్యయంతో నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కనెక్ట్ చేశారు. ఈ హైవేతో చెన్నై, బెంగళూరు వెళ్లేవారికి ఊరట దక్కింది.బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే కూడా చిత్తూరు మీదుగా వెళుతోంది. ఇప్పటికే ఈ హైవేలో బెంగళూరు- వి.కోట మధ్య రాకపోకలకు అనుమతించారు. మొగిలి ఘాట్ దగ్గర పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ లోపు ఆ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు.. బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె, బంగారుపాళ్యం మండలం మొగిలి, గుడిపాల మండలం రామాపురం దగ్గర ఉన్నాయి.