: భారత స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం అతిత్వరలోనే ముగుస్తుందన్న సంకేతాల నడుమ ఏప్రిల్ 1న భారత స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఒక దశలో 2 వేల పాయింట్ల వరకు పెరగ్గా చివరకు 1187 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 348 పాయింట్లు పుంజుకుంది. . అయితే ఇప్పుడు ఏప్రిల్ 2న సీన్ రివర్స్ అయింది. స్టాక్ మార్కెట్ లాభాలకు ఒక్కరోజులోనే బ్రేక్ పడింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఏప్రిల్ 2న ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్ల నష్టంతో 71,740 స్థాయిలో ఉంది. నిఫ్టీ 420 పాయింట్లు తగ్గి 22,250 స్థాయిలో కదలాడుతోంది. సెషన్ ప్రారంభంలో సూచీలు ఇంకా భారీగా పతనం అయ్యాయి. ఒక దశలో ఆరంభంలో సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా నష్టంతో 71,608.48 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దీంతో మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో నిమిషాల వ్యవధిలోనే రూ. 10 లక్షల కోట్లకుపైగా తగ్గింది. కిందటి రోజు ఇన్వెస్టర్ల సంపద రూ. 422 లక్షల కోట్లకుపైగా ఉండగా.. ఇవాళ అది రూ. 412 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ట్రంప్ ఏంటో.. ఆ ప్రకటనలు ఏంటో?స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పడిపోయేందుకు ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలే. కిందటి రోజు.. యుద్ధం ముగింపుపై సంకేతాలు ఇవ్వగా సూచీలు పుంజుకున్నాయి. ఇరాన్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు చేశారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులు చేయనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్ ముఖ్య నేతలు అంతమయ్యారని.. నౌకదళం, ఎయిర్‌ఫోర్స్‌ కూడా ఓడిపోయాయని చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలా పలుమార్లు ట్రంప్ వేర్వేరు, గజిబిజి ప్రకటనలు చేశారు. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు..ఇరాన్‌పై తాము నిర్దేశించుకున్న చాలా వరకు వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకున్నామని.. మరిన్ని లక్ష్యాల్ని సాధించేవరకు యుద్ధం చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే గత 2-3 రోజుల్లో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర ఒక్కసారిగా మళ్లీ భారీగా పెరిగింది. ఏప్రిల్ 1న బ్రెంట్ క్రూడాయిల్ 100 డాలర్ల స్థాయిలో ఉండగా.. ట్రంప్ ప్రసంగం తర్వాత సుమారు 6 శాతం వరకు పెరిగి 106 డాలర్ల మార్కు దాటింది. ఇదే క్రమంలో.. ఇన్వెస్టర్లలో మరోసారి తీవ్ర గందరగోళం.. భయాలు నెలకొన్నాయి. యుద్ధం ముగింపుపై సందేహాలు నెలకొన్నాయి. ఇది స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. పలు హెవీవెయిట్ స్టాక్స్ దారుణంగా పతనం అవుతున్నాయి. బీఎస్ఈ, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, ఇండిగో, ఎల్ఐసీ, ఎంఅండ్ఎం, ఎటర్నల్ ఇలా ప్రముఖ కంపెనీల స్టాక్స్ 3 శాతం వరకు పడిపోయాయి. రిలయన్స్, ఎస్బీఐ, HDFC బ్యాంక్ కూడా 2 శాతం వరకు తగ్గాయి. ఐటీ స్టాక్స్ మాత్రమే కాస్త తక్కువగా ప్రభావితం అయ్యాయి. గమనిక: పైన ఇచ్చింది కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.