విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన విజయ్–రష్మిక పెళ్లి ఫోటో, 'ఏందయ్యా సామీ' పాటకు వచ్చిన అనూహ్య స్పందనతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే ఇప్పుడు 'ర‌ణ‌బాలి' షూటింగ్ లొకేష‌న్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రాంతంలో, కర్నూలులోని బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో ‘’ సినిమా షూటింగ్ జరిగింది. ఇందులో భాగంగా చిత్రీకరించిన ఓ యాక్షన్ సీన్ కి సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంట్లో డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే.. విజ‌య్ దేవరకొండ గుర్రంపై వస్తూ, తన చేతిలో ఉన్న పెద్ద క‌త్తితో రౌడీలను ఊచకోత కోస్తూ కనిపించారు. ''ముండమోపి నా కొ*కా…ఏడున్నావ్ రా.. మీ ఇళ్ల‌లోకి వచ్చినా.. రా అప్పా.. సంపుదువ్ గానీ'' అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతున్నారు. ఎప్పుడూ తెలంగాణ స్లాగ్ లో మాట్లాడే విజయ్.. ఇలా రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం కొత్తగా ఉంది. ఆయన లుక్, గెటప్ బాగున్నాయి.'ర‌ణ‌బాలి' లీక్డ్ వీడియో రౌడీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈసారి మాస్ చూస్తారని, హిట్టు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇలా షూటింగ్ లొకేషన్ నుంచి వీడియోలు లీక్ అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కీలకమైన సన్నివేశాలు ముందే బయటకు వస్తే, ఎగ్జైట్మెంట్ మిస్ అవుతుందని అంటున్నారు. ఇప్పటి నుంచైనా టీమ్ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అందరూ సినిమా గురించి మాట్లాడుకోవాలని, చిత్ర బృందం కావాలనే ఈ వీడియో లీక్ చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలకు సంబంధించిన వీడియోలు ఇలానే లీక్ అయిన సంగతి తెలిసిందే.* 1854 - 1878 మధ్య కాలంలో బ్రిటీష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ చిత్రం రూపొందుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రణబాలి అనే వీరుడిగా నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అజయ్ – అతుల్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. T-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తుండగా.. నవీన్ యెర్నేని & వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ - రష్మిక కలిసి గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో నటించారు. వారి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడం, భార్యాభర్తలుగా మారిన తర్వాత విరోష్ నుంచి రాబోయే మొదటి సినిమా కావడంతో అభిమానులు 'రణబాలి' చిత్రాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు. 2026 సెప్టెంబర్ 11న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.