Latest : పసిడి ప్రియులకు మళ్లీ భారీ ఊరట దక్కింది. బంగారం ధరలు మళ్లీ ఒక్కరోజులోనే భారీ స్థాయిలో పతనం అయ్యాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల ఏప్రిల్ 3న ఉదయం 7 గంటలకు వార్త రాసే సమయంలో రూ. 3980 మేర తగ్గి (సుమారు రూ. 4 వేలు) 10 గ్రాములకు రూ. 1,48,970 వద్ద ఉంది. . గత వారం రోజుల్లో చూస్తే రూ. 3440, రూ. 1250, రూ. 170, రూ. 2510, రూ. 1030 ఇలా పెరిగాయి. ఈ క్రమంలో రూ. 9 వేల వరకు ధర పెరిగింది. ఇలా భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఇవాళ రూ. 3650 మేర తగ్గి తులం రూ. 1,36,550 వద్ద ఉంది. ఇది గత వారం రోజుల్లో ఇది కూడా భారీగా పెరిగింది. వరుసగా రూ. 3150, రూ. 1150, రూ. 150, రూ. 2300, రూ. 950 ఇలా పెరుగుతూ వచ్చాయి. 10 రోజుల వ్యవధిలో సుమారు రూ. 16 వేల వరకు పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. రూ. 10 వేలు తగ్గిన వెండి ధర..మరోవైపు వెండి రేట్లు కూడా ఒక్కసారిగా తగ్గుతున్నాయి. కిందటి రోజు కేజీపై రూ. 15 వేలు పెరగ్గా.. ఇప్పుడు రూ. 10 వేలు తగ్గడంతో హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2.55 లక్షల వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి సుమారు రూ. 1.70 లక్షల మేర తగ్గింది. ఆల్ టైమ్ హై ధర రూ. 4.25 లక్షలుగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు 4800 డాలర్ల స్థాయి వరకు చేరగా.. ఇప్పుడు అది 4670 డాలర్ల స్థాయిలో ఉంది. వెండి ధర కూడా 75 డాలర్లకుపైగా ఉండగా.. 72 డాలర్ల స్థాయికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా పుంజుకుంటోంది. ట్రంప్ ప్రకటనతోనే..కొద్ది రోజుల కిందట యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వగా.. బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయి. . ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న తరుణంలో క్రూడాయిల్ ధర ఒక్కరోజే 9 శాతం వరకు పెరిగి బ్యారెల్‌కు 110 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇదే క్రమంలో యూఎస్ డాలర్ పుంజుకుంది. దీంతో మళ్లీ బంగారం ధర తగ్గుతోంది. సాధారణంగానే డాలర్ పుంజుకుంటే.. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణ కోల్పోతుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.