సర్వే చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు.. భూమి సమస్యలకు చెక్, అందుబాటులోకి భూభారతి పోర్టల్

Wait 5 sec.

భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి అసలు పొంతన ఉండదు. ప్రభుత్వ భూములు, ఇతరుల భూమిని ఆక్రమించి ఉన్న భూముల కంటే ఎక్కువ భూములను రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు ఉంటారు. ఇక క్షేత్ర స్థాయిలో ఎక్కువ భూమి ఉన్నా.. రికార్డులు సరిగా లేకపోవడం వల్ల పట్టా పాసు పుస్తకాల్లో తక్కువ భూమి రిజిస్ట్రేషన్ కావడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. దీంతో రైతులు పంట పండించడం కంటే ఎక్కువగా భూరికార్డుల సవరణ కోసం అధికారుల చుట్టూ తిరగడమే ఎక్కువ అవుతోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో ఈ సమస్యలు మరిన్ని పెరిగాయని ఆరోపించిన ప్రస్తుత .ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్టు కింద ఈ భూభారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను అమలు చేసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని 5 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి.. అమలు చేసేందుకు రెడీ అయింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పైలట్‌ ప్రాజెక్టుగా గురువారం ప్రారంభమైంది.ఈ సమగ్ర భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. నిజంగా ఉన్న భూమికి.. రికార్డుల్లో ఉన్న సమాచారం సరిగ్గా సరిపోతేనే భూ భారతి పోర్టల్లో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రైతుకు పట్టాదార్ పాసు పుస్తకంతోపాటు భూధార్‌ నంబర్‌ను కూడా కేటాయిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్లను గానీ.. విస్తీర్ణాన్ని గానీ మార్చడానికి అవకాశమే ఉండదు. రాష్ట్రంలో భూముల వ్యవస్థను పకడ్బందీగా సరిచేసేందుకు రెవెన్యూ శాఖ ఈ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇక ఈ భూభారతిలో భాగంగా సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లను కలిపి ఒకే పోర్టల్‌ కిందికి తీసుకువచ్చారు. సర్వే వివరాలు.. స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉన్న వివరాలు (22 ఎ, ఇతరత్రా), రెవెన్యూ శాఖ రికార్డుల్లో ఉన్న వివరాలు అన్నీ ఈ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. మరోవైపు.. 2020 నవంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఏ సమాచారం ఉంటే దాని ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్‌ చేపట్టడంతో క్షేత్రస్థాయిలో భారీగా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటినీ సరిచేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ విధానంలో భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఇక నుంచి భూమిని సర్వే చేయడం తప్పనిసరి చేశారు. ఇందు కోసం మొదట ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలు, సర్వే శాఖ వద్ద ఉన్న వివరాలతో సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులు ఇస్తారు. తోటి రైతుల సమక్షంలోనే భూమిని సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు అందిస్తారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ.. రైతుకు సర్వే పటం జారీ చేస్తుంది. ఆ సర్వే పటం ఆధారంగా భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయిలో సర్వేలో ఎంత భూమి అయితే ఉంటుందో.. అంత భూమికే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రైతు చేసుకున్న దరఖాస్తుతోపాటు సర్వే పటం ఆధారంగా తహసీల్దార్, జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్‌ కలిసి.. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి చేసి పట్టాదార్ పాసుపుస్తకాన్ని జారీ చేయనున్నారు. దీంతోపాటు రైతుకు భూధార్‌ కార్డును కూడా జారీ చేస్తారు. ఆ భూదార్ కార్డులో భూమికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరుస్తారు. భూదార్ కార్డులో ప్రత్యేక సంఖ్య ఉండటం వల్ల దాన్ని మార్చడానికి వీలు లేకుండా చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్‌లో రైతులే స్వయంగా భూమి నక్షా, భూమి మార్కెట్‌ విలువ సహా కీలక విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక తమ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా కలుపుకుని.. చాలా మంది రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు. ఇక అలాంటి భూములు కూడా రిజిస్ట్రేషన్‌ సమయంలో దొరికిపోనున్నాయి.