మరో 25 రోజుల్లో ఆపరేషన్ సిందూర్ 2.0.. ప్రముఖ జ్యోతిషుడు సంచలన జోస్యం

Wait 5 sec.

గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌ బైసరన్ లోయలో పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడిచేసి, 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారు. దీనికి ప్రతీకారంగా చేపట్టి... పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య నాలుగు రోజుల పాటు కొనసాగిన సైనిక ఘర్షణలు.. కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి.అయితే, మళ్లీ పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహాసానికి పాల్పడినా.. ఈసారి మరింత గట్టిగానే బుద్దిచెబుతామని భారత్ పదేపదే హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్-2 గురించి ప్రముఖ జ్యోతిషుడు ప్రశాంతి కిణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంకా ముగియలేదని, తాత్కాలికంగా నిలిపివేశారన్న ఆయన... మరో 25 రోజుల్లో ప్రారంభం కావచ్చని జోస్యం చెప్పారు. ఇదంతా బీజేపీ పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల జిమ్మిక్కంటూ ఓ నెటిజన్ కామెంట్‌కు కూడా ఆయన రిప్లయ్ ఇచ్చారు. ఇలాంటి ఆరోపణలు చేస్తారనే బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆపరేషన్ మొదలయ్యే ఛాన్స్ ఉందన్నారు.‘‘ ఖచ్చితంగా జరుగుతుంది...!! ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు....!! దాన్ని కేవలం తాత్కాలికంగా నిలిపివేశారు....!! మరో 25 రోజుల్లోగా ఆపరేషన్ సింధూర్ తిరిగి ప్రారంభం కావచ్చు...!! మీలాంటి వారు ఈ సమయం గురించి ప్రశ్నిస్తారని మోదీ ప్రభుత్వానికి తెలుసు... అందుకే పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది...!! ఎన్నికల్లో గెలవడానికి మోదీ ప్రభుత్వానికి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు... దేశానికి ముప్పు వాటిల్లినప్పుడు, ఎదురుదాడి చేయడం తప్ప మరో మార్గం లేదు..’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. గతంలో ఈయన చెప్పిన జ్యోతిషం అంచనాలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న , భారత్‌లో ఇంధన సంక్షోభం వస్తుందని, బంగారం ధరలు తగ్గుతాయని జనవరిలోనే ఆయన జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్టు ఫిబ్రవరి 28న ఇరాన్‌‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైంది. దీని కారణంగా చమురు సంక్షోభం మొదలై.. భారత్‌ సహా పలు దేశాల్లో సంక్షోభం నెలకుంది. బంగారం ధరలు మార్చిలో తగ్గాయి. దీంతో ఆయన ఇప్పడు ఆపరేషన్ సిందూర్ 2 గురించి జోస్యం చెప్పడంతో అది కూడా నిజమవుతుందని భావిస్తున్నారు.