క్రెడిట్ కార్డ్ vs పర్సనల్ లోన్.. రెండింటి మధ్య తేడా ఏంటి.. ఏది బెటర్.. పూర్తి వివరాలివే!

Wait 5 sec.

: మనకు లోన్లు తీసుకునేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయని చెప్పొచ్చు. అయితే దీనికో ప్రత్యామ్నాయం కూడా ఉంది. క్రెడిట్ కార్డులపైనా లోన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లోన్ తీసుకునేందుకు ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు, లోన్ అవసరాలు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసాలు ఏం ఉన్నాయనేది చూద్దాం. రెండింట్లో ఏది బెటర్ అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. క్రెడిట్ కార్డుపై లోన్ విషయానికి వస్తే.. మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల దగ్గర మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి కాబట్టి.. అదనంగా ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండకపోవచ్చు. కాస్త తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది కాస్త బెటర్. అదే పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. ఇక్కడ దరఖాస్తును ధ్రువీకరించేందుకు ఇన్‌కం ప్రూఫ్, పే స్లిప్స్ వంటి ఇతర కొన్ని డాక్యుమెంట్లు కావాలి. . సాధారణంగా క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే లోన్లను తిరిగి చెల్లించేందుకు 12-36 నెలల వరకు గడువు ఉంటుంది. ఇక్కడ లోన్లపై వడ్డీ సహా ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. కొన్నిసార్లు మీ అర్హతల్ని బట్టి.. బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్లపై ఫీజుల్ని రద్దు చేస్తాయి. అదే పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. దీనిని తిరిగి చెల్లించేందుకు రుణ గ్రహీతలకు 12-60 నెలల వరకు సమయం ఇస్తారు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. వీటిల్లోనూ ప్రీ అప్రూవ్డ్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవచ్చు. క్రెడిట్ కార్డుపై లోన్ విషయానికి వస్తే.. క్రెడిట్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ లోన్లు లభిస్తాయి. ఆమోదించిన రుణాన్ని నేరుగా దరఖాస్తుదారుడికి చెందిన సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌కు బదిలీ చేస్తారు. పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. సిబిల్ స్కోరు మెరుగ్గా ఉంటే సదరు బ్యాంక్ ఖాతాదారులు కాని వారు కూడా ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుపై లోన్‌ను సాధారణంగా అప్లై చేసిన 24 గంటల్లోపు ఆమోదిస్తారు. లోన్ మొత్తం కార్డు సంస్థ ముందుగా ఆమోదించిన కార్డు లిమిట్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. లోన్ ఆమోదానికి 3-5 రోజులు పట్టొచ్చు. దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ గరిష్ట లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. డిజిటల్ లోన్స్ వేగంగా ఆమోదిస్తారు. వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.