రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. తెలంగాణలో అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. గత 11 రోజులుగా తెలుగు రాష్ట్రాలను వణికించిన చలిగాలులు ఈ రాత్రికి పూర్తిగా ముగియనున్నాయి. ఇవాళ్టి రాత్రి, రేపు ఉదయం మాత్రమే గట్టి చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపటి నుంచి చలి నుంచి ఉపశమనం పొందొచ్చు. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన తూర్పు గాలులు వీయడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని అన్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెప్పారు. వాతావరణంలో మార్పులు మొదలవగానే.. తుపాను ప్రభావం చూపుతుందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడే తదుపరి వ్యవస్థ సైక్లోన్ లేదా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఇది తుఫానుగా మారితే.. దీనికి 'సెన్యార్' అని పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకురావచ్చని అంచనా. ఇది 2018 నాటి 'ఫెథాయ్' , ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన 'మొంథా' (Montha) తుఫానులను పోలిన హైబ్రిడ్ రకానికి చెంది ఉండవచ్చునని అంటున్నారు. దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణలో నవంబర్ 23-24 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని.. కానీ వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వెల్లడించారు. ఈ సెన్యార్ తుఫాను ప్రభావంతో నవంబర్ 27, 28 తర్వాత తూర్పు తెలంగాణలో ఖచ్చితంగా మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని.. అయితే వాటి తీవ్రత ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని చెప్పారు. ఇక తెలంగాణలో నవంబర్ 19న పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం అసిఫాబాద్‌లో 7.9, ఆదిలాబాద్‌లో 8.8, సిరిసిల్లలో 9.0, కామారెడ్డిలో 9.3, నిజామాబాద్‌లో 9.4, సంగారెడ్డిలో 9.5, నిర్మల్‌లో 9.7, జగిత్యాలలో 9.8 డిగ్రీ సెల్సియస్ చొప్పున సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హెచ్‌సీయూ పరిధిలో 10.8, రాజేంద్రనగర్ పరిధిలో 12.2, బీహెచ్ఈఎల్ పరిధిలో 12.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.