ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హై స్పీడ్ కారిడార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీ నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ హై స్పీడ్ కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-44పై ప్రయాణానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం 8-9 గంటలు పట్టే ప్రయాణం కేవలం 5 గంటల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు. ఈ కారిడార్‌ను వాహనాలు 120 కి.మీ. వేగంతో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కారిడార్ కోసం మూడు మార్గాలను పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44కు సమాంతరంగా ఈ కొత్త హైస్పీడ్‌ కారిడార్‌ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు డీపీఆర్‌ కూడా సిద్ధమవుతోంది.. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రత్యామ్నాయ మార్గాలను (ఎలైన్‌మెంట్లు) రూపొందించారు. వీటిలో ఒక మార్గాన్ని మోర్త్‌ (జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ) ఆమోదించనుంది. హైదరాబాద్-బెంగళూరు NH-44ను ఆరు లేదా ఎనిమిది వరుసలకు విస్తరించాలని భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు.ఇప్పటికే ఉన్న హైవే పక్కన కర్నూలు, అనంతపురం వంటి నగరాలు, నివాస ప్రాంతాలు ఉండటంతో విస్తరణ కష్టమని అధికారులు గుర్తించారు. అందుకే కొత్తగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త హైస్పీడ్ కారిడార్ NH-44కు 10-15 కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా వెళ్తుంది. మొత్తం 576 కిలోమీటర్ల పొడవున్న NH-44లో తెలంగాణలో 210 కి.మీ., ఏపీలో 260 కి.మీ., కర్ణాటకలో 106 కి.మీ. దూరం ఉంది.గతంలో NH-44ను నాలుగు వరుసల నుంచి ఆరు లేదా ఎనిమిది వరుసలకు పెంచాలని అనుకున్నారు. కానీ, హైవేకు దగ్గరలో కర్నూలు, అనంతపురం నగరాలు, అనేక నివాస ప్రాంతాలు ఉండటంతో ఈ పని సాధ్యం కాదని తేలింది. అందుకే, కొత్తగా ఆరు వరుసలతో గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త కారిడార్ NH-44కు దాదాపు సమాంతరంగా, 10-15 కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది. ఈ NH-44 మొత్తం 576 కిలోమీటర్లు ఉంటే.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 260 కిలోమీటర్లు, తెలంగాణలో 210 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్లు ఉంది.హైదరాబాద్-బెంగళూరు మధ్య ఏపీ మీదుగా నిర్మించే ఈ కొత్త హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుకు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్‌ సిద్ధం చేయాలని సలహా సంస్థకు గడువు విధించారు. ఈ కారిడార్‌పై అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ విధానం అమలు చేయనున్నారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించడానికి, బయటకు రావడానికి (ఎంట్రీ, ఎగ్జిట్‌) అవకాశాలు ఉంటుంది. అలాగే ఈ కారిడార్‌ మధ్యలో ఇతర ఎన్‌హెచ్‌లను దాటే చోట్ల ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తారు. ఈ కారిడార్‌ మొత్తం సుమారు నాలుగైదు మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కారిడార్‌పై ఆధునిక ట్రాఫిక్‌ నిర్వహణ పద్ధతులను ఉపయోగిస్తారు.ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు కోసంమూడు మార్గాలను (ఎలైన్‌మెంట్లను) సిద్ధం చేస్తున్నారు. 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మూడు మార్గాలలో ఒకటి ఖరారు చేసిన తర్వాత మొత్తం వ్యయం ఎంత అవుతుందో క్లారిటీ వస్తుంది. డీపీఆర్‌ ఫిబ్రవరి నాటికి సిద్ధం చేయాలని NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సలహా సంస్థకు గడువు ఇచ్చింది.