ఇక్కడ చదరపు అడుగుకు అద్దె రూ. 19 వేలు.. దేశంలోనే టాప్.. ప్రపంచంలో ఎక్కువ రెంట్ ఎక్కడంటే?

Wait 5 sec.

: రియల్ ఎస్టేట్ మార్కెట్ భారతదేశంలో మళ్లీ దూసుకెళ్తోంది. వెళ్లిందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో అద్దెలు, ఇళ్లు, భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో రియల్ ఎస్టేట్‌ పరంగా.. ఎక్కువ ధరలు ఎక్కడ ఉంటాయంటే ముందుగా ముంబై పేరు వినిపిస్తుంటుంది. ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఇలా ఉంటాయని చెప్పొచ్చు. విక్రయాల పరంగా కూడా ఈ నగరాలే ప్రధానంగా వినిపిస్తుంటాయి. అయితే.. అద్దెల పరంగా దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉన్నదేంటో తెలుసా.. ఇది ప్రపంచంలోనే 24వ స్థానంలో కూడా నిలిచింది. అదే ఢిల్లీ ఖాన్ మార్కెట్.అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కుష్మన్ & వేక్‌ఫీల్డ్ నవంబర్ 19న ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఢిల్లీ ఖాన్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన రిటైల్ విక్రయ ప్రాంతాల జాబితాలో 24వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఒక స్థానం పడిపోయినప్పటికీ.. భారత్‌లో మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఖాన్ మార్కెట్లో చదరపు అడుగు అద్దె వార్షిక ప్రాతిపదికన అంటే ఏడాదికి 223 డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది రూ. 19,700కుపైనే ఉంటుంది. మన దేశంలో ఖాన్ మార్కెట్ ప్రస్తుతం అత్యంత ఖరీదైన హై- స్ట్రీట్ వ్యాపార ప్రదేశంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతం చూస్తే యూకే లండన్‌లోని న్యూ బాండ్ స్ట్రీట్. ఇక్కడ వార్షిక అద్దె చదరపు అడుగుకు 2,231 డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఇది రూ. 1.97 లక్షలుగా ఉంది. తర్వాత ఇటలీ మిలాన్‌లోని వియా మాటే నెపోలియన్ మెయిన్ స్ట్రీట్. ఇక్కడ అద్దె 2,179 డాలర్లు (రూ. 1.93 లక్షలు). అమెరికా న్యూయార్క్‌లోని అప్పర్ ఫిఫ్త్ అవెన్యూలో వార్షిక అద్దె చదరపు అడుగుకు రూ. 1.77 లక్షలుగా ఉంది. భారత్‌లో అత్యంత ఖరీదైన టాప్-3 రిటైల్ హై స్ట్రీట్లలో ఢిల్లీ- NCR ఉంది. ఖాన్ మార్కెట్‌తో పాటు ఢిల్లీ కన్నాట్ ప్లేస్, గురుగ్రామ్‌లోని గెలెరియా మార్కెట్ వరుసగా ఉన్నాయి. కన్నాట్ ప్లేస్/గెలెరియా మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ. 14,956 గా ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో.. , కోల్‌కతా పార్క్ స్ట్రీట్ 36, హైదరాబాద్ బంజారాహిల్స్ 48వ స్థానంలో నిలిచాయి. గురుగ్రామ్ గెలెరియా మార్కెట్లో అద్దెలు 25 శాతం పెరిగాయి. కన్నాట్ ప్లేస్‌లో 14 శాతం, ముంబై కెంప్స్ కార్నర్‌లో 10 శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.