సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. రాత్రికి రాత్రే ఇలా.. రూ.6000 పెరిగిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే

Wait 5 sec.

: పసిడి ప్రియులకు సడెన్ షాక్ తగిలింది. వరుసగా మూడు సెషన్లలో తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. రాత్రికి రాత్రే మారిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం దేశీయంగానూ ప్రభావం కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు సన్న గిల్లడంతో దిగొచ్చిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరగడం గమనార్హం. వాణిజ్య అనిశ్చితులు, యుద్ధాలు, బంగారం సరఫరా, డిమాండ్ వంటివి సైతం ధరలపై ప్రభావం చూపిస్తాయి. భారత్‌లో బంగారానికి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. ఇక పండగలు, ప్రత్యేక రోజుల్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో ధరల్లో ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపునకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42.51 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4108 డాలర్లు దాటింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 1.68 శాతం మేర పెరిగింది. దీంతో సిల్వర్ రేటు ఔన్సుకు 51.52 డాలర్ల పలుకుతోంది. హైదరాబాద్‌లో గోల్డ్ రేటుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములు (తులం)పై ఏకంగా రూ.1200 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,24,860 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఈరోజు తులానికి రూ.1100 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల నగల బంగారం రేటు రూ. 1,14,450 వద్దకు చేరింది. రూ.6000 పెరిగిన వెండిహైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.6000 మేర పెరగడం గమనార్హం. దీంతో ఈరోజు కిలో వెండి రేటు రూ. 1,76,000 వద్దకు ఎగబాకింది. అయితే, పుణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కిలో వెండి రేటు రూ.1,68,000 వద్ద లభిస్తుండడం గమనార్హం. గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు నవంబర్ 20 గురువారం ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, పసిడి ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. కొనే ముందే తెలుసుకోవడం మంచిది.