ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పని చేయకుంటే YONO యాప్ బ్లాక్? ఈ వార్తలో నిజమెంతా?

Wait 5 sec.

SBI: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? అయితే, మీకో అలర్ట్. ఎస్‌బీఐకి సంబంధించిన ఓ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖాతాదారులకు తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయకపోతే అయిపోతుందంటూ ఆ సందేశం సారాంశం. యోనో యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి ఇది ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. మరి ఈ వార్తలో నిజం ఎంత? అంటే ఎలాంటి నిజం లేదనే చెప్పాలి. ఎస్‌బీఐ వైరల్ సందేశం గురించి తెలుసుకుందాం. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కాజేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ పేరుతో ఓ నకిలీ సందేశాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ దానిని డౌన్‌లోడ్ చేసుకుని తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని మోసపూరిత సూచనలు చేస్తున్నారు. దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని లేదంటే ఎస్‌బీఐ యోనో యాప్ () బ్లాక్ అవుతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి సందేశాలు, ప్రకటనలను నమ్మొద్దని ప్రజల్ని కోరింది. ప్రజలు ఎవరూ అలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని, వాటిల్లో తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు, ఆధార్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఏవైనా అనుమానాస్పద సందేశాలు, ప్రకటనలు ఉంటే ఫిర్యాదు చేయాలని, సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని సూచించింది. అలాంటి సందేశాల వివరాలను pishing@sbi.co.inకు రిపోర్ట్ చేయాలని కోరింది. మరోవైపు.. ఇలాంటి నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం విజ్ఞప్తి చేసింది. 'క్లిక్ చేసే ముందు ఆలోచించండి. బ్యాంకింగ్ యాప్ అప్డేట్ చేసుకోవాలని నకిలీ ఏపీకే లింకులను సైబర్ మోసగాళ్లు పంపుతున్నారు. ఇది మీ డబ్బులను చోరీ చేసే ఓ స్కామ్. అలాంటివి వస్తే క్లిక్ చేయొద్దు, డౌన్‌లోడ్ చేసుకోవద్దు, అప్డేట్ చేయవద్దు. యాప్‌లను కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏవైనా సైబర్ మోసాలకు 1930కు రిపోర్ట్ చేయండి' అని విజ్ఞప్తి చేసింది.