ఐపీఎల్ 2026లో 10 ఫ్రాంఛైజీల హెడ్‌కోచ్‌లు ఎవరంటే..!

Wait 5 sec.

సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్.. తమ ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరను తిరిగి నియమించింది. గత సీజన్‌లో ఈ బాధ్యతల్లో ఉన్న రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. సంగక్కర 2021-2024 వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం వచ్చే సీజన్‌కు ముందు కొత్త కోచ్‌ను నియమించింది. అభిషేక్ నాయర్‌కు ఈ ప్లేసులో ఎంపిక చేసింది. గత మూడు సీజన్లలో కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ నిష్క్రమించడంతో కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌కు ముందు ఫ్రాంఛైజీల హెడ్‌కోచ్‌లుగా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..* రాజస్థాన్ రాయల్స్ - కుమార సంగక్కర* కోల్‌కతా నైట్ రైడర్స్ - అభిషేక్ నాయర్* ముంబై ఇండియన్స్ - మహేల జయవర్దనే* చెన్నై సూపర్ కింగ్స్ - స్టీఫెన్ ఫ్లెమింగ్* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఆండీ ఫ్లవర్* లక్నో సూపర్ జెయింట్స్ - జస్టిన్ లాంగర్* గుజరాత్ టైటాన్స్ - ఆశిష్ నెహ్రా* ఢిల్లీ క్యాపిటల్స్ - హేమంగ్ బదానీ* సన్ రైజర్స్ హైదరాబాద్ - డేనియల్ విట్టోరీ* పంజాబ్ కింగ్స్ - రికీ పాంటింగ్ఇక ఐపీఎల్ 2026 వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. అన్ని ఫ్రాంఛైజీలు కూడా నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఇందులో కొన్ని జట్లూ అనూహ్యంగా స్టార్ ఆటగాళ్లను విడుదల చేశాయి. కేకేఆర్ అనూహ్యంగా ఆండ్రీ రస్సెల్‌ను రిలీజ్ చేసింది. ఇక ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న జరగనుంది. ఇందులో ప్రధానంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై అందరి దృష్టి నెలకొంది. అతడి కోసం ఫ్రాంఛైజీలు భారీ ధర వెచ్చించే అవకాశం ఉంది.