ప్రయాణికులకు మరిన్ని తీసుకుంది. రైల్వే స్టేషన్లలో ప్రముఖ బ్రాండ్ క్యాటరింగ్‌ ఔట్‌లెట్స్‌ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెక్‌డొనాల్డ్స్‌, , పిజ్జా హట్, బాస్కిన్‌ రాబిన్స్‌, బికనీర్‌వాలా, హల్దీరామ్స్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఔట్‌లెట్లను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రతిపాదనల ఆధారంగా రైల్వే బోర్డు క్యాటరింగ్ పాలసీ 2017ని సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబరు 17న ఉత్తర్వులు జారీచేస్తూ ఆయా జోన్లకు సూచనలు పంపింది. డిమాండ్-స్పేస్‌ ప్రమాణాలను అందుకున్నట్టయితే సింగిల్‌ బ్రాండ్ ఔట్‌లెట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. వీటిని స్వయంగా లేదా ఫ్రాంచైజీల ద్వారా ఆయా సంస్థలు నిర్వహించొచ్చని పేర్కొంది. కానీ, ఎంపిక మాత్రం ఈ-ఆక్షన్ విధానం ద్వారానే జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో టీ, కాఫీ, లైట్‌ స్నాక్స్‌ ఈ మూడు రకాల స్టాల్స్ మాత్రమే ఉండగా.. కూడా ఏర్పాటుకానున్నాయి. నామినేషన్‌ విధానంలో ఏ ఔట్‌లెట్ కేటాయింపు ఉండదని, ప్రత్యేక విభాగం కింద పరిగణించి ఈ-ఆక్షన్ ద్వారా మాత్రమే కేటాయింపులు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఐదేళ్ల కాలానికి ఒప్పందం అమల్లో ఉంటుందని, కనీస లైసెన్స్ ఫీజు కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని పేర్కొన్నారు. సింగిల్-బ్రాండ్ ఔట్‌లెట్స్‌ ఏర్పాటుకు ముందు ప్రయాణికుల డిమాండ్, అందుబాటులో ఉన్న స్థలం, సాధ్యాసాధ్యాలు వంటివి పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు సూచించింది. ఈ స్టాల్స్‌ ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, రైల్వే భూనిర్వాసితులకు ప్రత్యేక కోటా ఉంది. ప్రీమియం బ్రాండ్స్ ఔట్‌లెట్ల ప్రభావం ఈ కోటాపై పడబోదని అధికార వర్గాలు తెలిపాయి. రైల్వే స్టేషన్‌లో పరిస్థితులను బట్టి కాంట్రాక్ట్ నిబంధనలను రూపొందించే బాధ్యతను జోన్లకే అప్పగించారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ రోజుకు 10 లక్షల మందికిపైగా ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ఆహారం అందిస్తోంది. ప్రీమియం బ్రాండ్లు ఏర్పాటుతో రద్దీగా ఉన్న స్టేషన్లలో ఫుడ్‌ ఆప్షన్లు పెరుగుతాయి.