రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించే లక్ష్యంతో.. రష్యాతో వాణిజ్యాన్ని చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేశారు. ఈ నిర్ణయం.. రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన భారత్‌, చైనాలకు తీవ్రమైన ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.ఫ్లోరిడా నుంచి వైట్‌హౌస్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా కఠినంగా వ్యవహరించే సెనేట్ చట్టానికి తాను ఓకే చెబుతానని తెలిపారు. ఈ జాబితాలో ఇరాన్‌ను కూడా చేర్చవచ్చని తాను సూచించినట్లు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ కొత్త బిల్లు ట్రంప్‌కు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 500 శాతం వరకు టారిఫ్‌లను విధించే అధికారాన్ని ఇస్తుంది. రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన చైనా, భారత్‌లపై ఈ చట్టం తీవ్ర ప్రభావం చూపుతుంది.సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక ప్రకారం.. అక్టోబర్‌లో రష్యా చమురును కొనుగోలు చేసిన దేశాల్లో చైనా తర్వాత రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. భారత్ మొత్తం 3.1 బిలియన్ల యూరోలు అంటే దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది. ఇందులో 81 శాతం (రూ.25 వేల కోట్లు ) ముడి చమురు కొనుగోళ్లే ఉన్నాయి. అదే సమయంలో భారత్ కంటే చైనా మరిన్ని ఎక్కువ కొనుగోళ్లు చేసింది. ఈ అక్టోబర్‌లో రష్యా నుంచి చైనా 5.8 బిలియన్ల యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.60 వేల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది.ఇప్పటికే ఆగస్టు 27వ తేదీ నుంచి రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌పై 50 శాతం పన్నులను భారత దిగుమతులపై అమెరికా విధిస్తోంది. అయినప్పటికీ.. తేల్చి చెప్పింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. హామీ ఇచ్చారని డొనాల్డ్ ట్రంప్ గతంలో పేర్కొన్నప్పటికీ.. అక్టోబర్‌లో రష్యా ముడి చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 11 శాతం పెరగడం గమనార్హం.మరోవైపు.. భారత్ తన ఇంధన వనరులను ఇతర మార్గాల్లో సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం హర్‌దీప్ సింగ్ పూరి ప్రకటించారు. 2026 సంవత్సరానికి అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి వార్షిక దిగుమతుల్లో 10 శాతం వరకు ఉండేలా ఏడాదికి దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతికి సంబంధించి.. ఒక సంవత్సరం ఒప్పందాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కుదుర్చుకున్నాయని వెల్లడించారు.