భారత్‌లోని ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. రూ.799కే యాపిల్ కేర్ ప్లస్.. 2 ఏళ్ల వరకు

Wait 5 sec.

AppeCare+: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లోని యాపిల్ యూజర్ల కోసం కొత్త యాపిల్ కేర్ కేవరజీ (AppleCare+) ప్లాన్లను ప్రకటించింది. తమ వినియోగదారులకు మరింత సౌలభ్యంగా అందుబాటు ధరలో నెల వారీ, వార్షిక చందా ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు తాజాగా వెల్లడించింది. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 17 వరకు అలాగే ఐఫోన్ ఎస్ఈకి సైత ఈ కవరేజీ వర్తిస్తుందని యాపిల్ కంపెనీ తెలిపింది. యాపిల్ డివైజ్ ఇన్సూరెన్స్ కోసం ప్రస్తుతం థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో యాపిల్ కేర్ ప్లస్ ను భారత్‌కు విస్తరించింది. సాధారణంగా కొత్త ఐఫోన్‌కు ఒక సంవత్సరం హార్డ్ వేర్ వారంటీ, 90 రోజుల పాటు ఉచిత టెక్నికల్ సపోర్ట్ వంటివి లభిస్తాయి. అయితే, యాపిల్ కేర్ ప్లస్ తీసుకున్నట్లయితే ఈ రక్షణను రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చని యాపిల్ సంస్థ తెలిపింది. అంతే కాకుండా ప్రమాదవశాత్తు జరిగిన నష్టాలకు సైతం అన్‌లిమిటెడ్ రిపేర్ సదుపాయం సైతం ఉంటుంది. భారత్‌లోని వినియోగదారుల కోసం యాపిల్ కేర్ ప్లస్ నెలవారీ ప్లాన్లను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ. 799 నుంచే ప్రారంభమవుతున్నాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. తీసుకొచ్చినట్లు యాపిల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కైయాన్ డ్రాన్స్ తెలిపారు. వినియోగదారులు కొత్త ఐఫోన్ కొనుగోలు చేసిన వెంటనే లేదా 60 రోజుల లోపు యాపిల్ కేర్ పస్ తీసుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఉత్పత్తుల సెట్టింగ్స్ యాప్ ద్వారా యాపిల్ కేర్ ప్లస్ కు సబ్ స్క్రైబ్ అవ్వవచ్చు. యాపిల్ కేర్ ప్లస్ కవరేజీలో భాగంగా బ్యాటరీ రీప్లేస్మెంట్ సర్వీస్, 24 గంటల ప్రయారిటీ సపోర్ట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద మాత్రమే రిపేర్ చేస్తారు. దీంతో యాపిల్ ఒరిజినల్ విడిభాగాలనే ఉపయోగిస్తారని యాపిల్ కంపెనీ హామీ ఇస్తోంది. మీ సమీపంలోని ఆథరైజ్డ్ కేంద్రం కోసం యాపిల్ సపోర్ట్ యాప్ లేదా యాపిల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని పేర్కొంది.