శ్రీ సత్యసాయి శత జయంతి, హాజరైన ప్రధాని మోదీ.. పుట్టపర్తికి తరలివచ్చిన ప్రముఖులు

Wait 5 sec.

మంగళవారం (నవంబర్ 18) పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయిబాబా శివైక్యం తర్వాత జరుగుతున్న హాజరయ్యారు. ప్రశాంతి నిలయానికి చేరుకుని.. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ వెంట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఆ తర్వాత హిల్‌ వ్యూ స్టేడియానికి మోదీ వెళ్లారు. దీంతో, హిల్ వ్యూ ఆడిటోరియం మొత్తం ఎ‌స్‌పీజీ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లింది. కాగా, పుట్టపర్తిలోని సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నేపథ్యంలో.. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. తరలివచ్చిన ప్రముఖులు..సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖులు తరలివచ్చారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, సినీనటి ఐశ్వర్యరాయ్ సత్యసాయి బాబా ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. కాగా, ఈ సందర్భంగా సచిన్ తెందూల్కర్‌ను మంత్రి నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 9.2 కేజీల బంగారంతో బాబా ఉత్సవ మూర్తి..మంగళవారం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో.. రథోత్సవ వేడుకను సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన వెండి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. .. పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. కాగా, ఈ శత జయంతి ఉత్సవాల్లో కళా జాతర బృందాలు విశేష ఆకర్షణగా నిలిచాయి.రాష్ట్రపతి రాక..కాగా, నవంబర్ 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ వెల్లడించారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి.. 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరవుతారని తెలిపారు