రోజుకు రూ.7లోపే.. BSNL స్మార్ట్ సేవింగ్స్ ప్లాన్.. 72 రోజులు, రోజుకు 2జీబీ, అన్‌లిమిటెడ్ కాల్స్

Wait 5 sec.

: ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు కనీస రీఛార్జ్ చేసుకోవాలన్నా రూ.200 పైన వెచ్చించాల్సి వస్తోంది. ఇక 28 రోజులకు రూ.350కి పైగా రీఛార్జ్ ధరలు ఉన్నాయి. అదే 56 రోజుల ప్లాన్ల ధరలు రూ.700 వరకు ఉన్నాయి. ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడీయాలు కొద్ది రోజుల క్రితమే రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచిన సంగతి తెలిసింది. ఆ తర్వాత కనీస రీఛార్జ్ ప్లాన్లను ఎత్తివేశాయి. అదనపు భారం తమ నెట్ వర్క్ వినియోగదారులపై మోపాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ చాలా చౌకైన ప్లాన్లను తీసుకొస్తూ యూజర్లను తమవైపునకు తిప్పుకుంటోంది. తక్కువ ధరకే అధిక డేటాను కల్పిస్తోంది. ఇటీవలే కేవలం అయితే, ఇది లిమిటెడ్ టైమ్ పీరియడ్ ప్లాన్ గా పేర్కొంది. డిసెంబర్ 13వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇప్పుడు మరో చౌకైన ప్లాన్ ప్రకటించింది. అదే 72 రోజుల స్మార్ట్ సేవింగ్స్ ప్లాన్. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 72 రోజుల పాటు నెట్‌వర్క్, డేటా, ఎస్ఎంఎస్, కాల్స్ పొందవచ్చని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. బీఎస్ఎన్ఎల్ స్మార్ట్ సేవింగ్స్ ప్లాన్ ధర రూ.485గా నిర్ణయించింది. 72 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. అంటే రోజుకు కేవలం రూ.6.74 మాత్రమే పడుతోంది. ఇంత చాలా తక్కువ ధరకే రోజుకు 2జీబీ డేటా ప్లాన్ అందిస్తుండడం గమనార్హం. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా 72 రోజుల పాటు అంటే 144 జీబీ పొందవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. 72 రోజుల చిల్ మోడ్ యాక్టివేట్ చేసుకోండి అంటూ తమ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ సూచించింది. దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. అయితే, నెట్‌వర్క్ సమస్య ఇబ్బంది పెడుతున్నట్లు పలువురు నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. నెట్‌వర్క్ సమస్య పరిష్కారం అయితే ఎక్కువ మంది బీఎన్ఎన్ఎల్‌కి మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.