ఏపీలో తగిలేలా కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత మరికొంతమంది రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇక వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు.. కండువాలు మార్చేశారు. దీంతో పలుచోట్ల మేయర్ పీఠాలను, మున్సిపల్ ఛైర్మన్ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ జాబితాలోకి నెల్లూరు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీద అవిశ్వాస తీర్మానం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నెల్లూరు మేయర్ స్రవంతి తీరును తప్పుబడుతూ.. జిల్లాకు చెందిన మంత్రి పొంగూరు నారాయణను 40 మంది కార్పొరేటర్లు కలవడం ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.మంత్రి నారాయణను కలిసిన కార్పొరేటర్లు మేయర్ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. మేయర్‌ స్రవంతి దంపతులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మేయర్ దంపతులు అవినీతికి పాల్పడుతున్నారని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. నెల్లూరుకు కొత్త మేయర్‌ కావాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్ల వాదనతో మంత్రి నారాయణతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. తీర్మానంపై కార్పొరేటర్లు సంతకాలు చేశారని.. సోమవారం ఉదయం ఎన్నికల అధికారికి ఇవ్వనున్నట్లు సమాచారం.మరోవైపు నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 56 డివిజన్లు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో 56 కార్పొరేటర్ పదవులను వైసీపీ గెలుచుకుంది. అయితే ఆ తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో 29 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే మేయర్ స్రవంతి వైసీపీ కావటంతో.. సాంకేతికంగా మేయర్ పీఠం వైసీపీ ఖాతాలో ఉంది. తాజాగా 40 మంది కార్పొరేటర్లు ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పటంతో.. మేయర్ పీఠం వైసీపీ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం కార్పొరేటర్లు మరోసారి భేటీయై.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.