పెళ్లి తర్వాత నాగచైతన్య ఫస్ట్ బర్త్ డే.. రేర్ ఫొటోతో సర్ప్రైజ్ చేసిన శోభిత ధూళిపాళ..

Wait 5 sec.

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నేడు (నవంబర్ 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. #HBDYuvasamratNagaChaitanya, #HBDNagaChaitanya వంటి హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు చైతూకి ఆయన సతీమణి శోభిత ధూళిపాళ స్పెషల్ బర్త్ డే విషెస్ అందజేసింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఓ రేర్ ఫోటోని షేర్ చేసింది. ''హ్యాపీ బర్త్ డే లవర్'' అంటూ శోభిత ధూళిపాళ పోస్ట్ పెట్టింది. నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది. ఇందులో చైతూ తన అర్థాంగికి సెట్టర్ తొడుగుతూ కనిపించారు. లుక్ చూస్తుంటే, ఇది 'తండేల్' టైంలో వెకేషన్ కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అని తెలుస్తోంది. జంట భలే క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శోభితకి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ, జాగ్రత్తగా చూసుకునే భర్త దొరికాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చైతూ దీనిపై స్పందిస్తూ హార్ట్ సింబల్ ని రిప్లైగా పెట్టారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్లపాటు డేటింగ్ చేసి, గతేడాది డిసెంబరులో వివాహ బంధంలో అడుగుపెట్టారు. అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ జంట.. మరికొన్ని రోజుల్లో తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోనున్నారు. గడిచిన పదకొండు నెలల కాలంలో ప్రతీ సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. తమ ప్రేమ బంధాన్ని తెలియజేసేలా శోభిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు చైతన్యకి శోభిత స్పెషల్ విషెస్ అందజేసింది. పెళ్లి తర్వాత తన భర్త ఫస్ట్ బర్త్ డే కావడంతో, మరింత ప్రత్యేకంగా భావిస్తున్నట్లు అర్థమవుతోంది.