ఈ 3 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల విలీనం.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక 2 సంస్థలు కనిపించవ్..!

Wait 5 sec.

PSU Merger: దేశంలోని మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ( Companies) విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పునరుద్ధరించినట్లు సమాచారం. ఈ విలీన ప్రక్రియ పూర్తయితే కొత్త భారీ సాధారణ బీమా కంపెనీ ఏర్పాటు కానుంది. దీంతో ఈ కొత్త కంపెనీ ప్రైవేట్ బీమా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలదని ప్రభుత్వం భావిస్తోంది. గతంలోనే ఈ ప్రతిపాదన వచ్చినా విరమించుకున్న మరి ఏ ఏ బీమా కంపెనీలను విలీనం చేయనున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. విలీనం కానున్న బీమా కంపెనీలుప్రభుత్వం విలీనం చేయాలని ప్రతిపాదించిన మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా ఇదే. లిమిటెడ్ (National Insurance Company Ltd)యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (United India Insurance Company Ltd)ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Oriental Insurance Company Ltd)ఈ మూడు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలను విలీనం చేసి ఒకే పెద్ద బీమా సంస్థగా మార్చడం ద్వారా ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని, వనరుల వినియోగాన్ని మెరుగుపరచాలని, మార్కెట్‌లో వాటి వాటాను బలోపేతం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విలీన ప్రతిపాదన వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు తమ మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తోంది. విలీనం ద్వారా ఏర్పడే పెద్ద సంస్థ మెరుగైన టెక్నాలజీ, విస్తృత నెట్‌వర్క్, బలమైన మూలధనాన్ని కలిగి ఉండటం వల్ల ప్రైవేట్ పోటీని సమర్థంగా తట్టుకోగలదని కేంద్రం భావిస్తోంది. ఇక రెండోది వనరుల పెంపు. విలీనం ద్వారా ఏర్పడే కొత్త సంస్థను పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) తీసుకురావడం లేదా ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవడం సులభమవుతుంది. ఇది ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చగలదు.అయితే ఈ విలీన ప్రతిపాదన కొత్తది కాదు. 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కూడా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మూడు కంపెనీలను విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల, ముఖ్యంగా మూలధన సమస్యలు, కార్యాచరణ సవాళ్ల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం, మూడు కంపెనీలు ఆర్థికంగా కొంత మెరుగుపడిన తరుణంలో వాటి మూలధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిధులను సమకూర్చిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ విలీన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బీమా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది.