"మా పని అయిపోయింది అనుకున్నారు.. కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది" థ్రిల్లింగ్ విక్టరీపై సౌతాఫ్రికా స్పిన్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Wait 5 sec.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ మిగిల్చిన అనుభూతికి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే, మొదటి రెండు రోజుల ఆట చూసిన ఎవ్వరైనా ఈ టెస్టులో సఫారీల ఓటమి తథ్యం అని అనుకున్నవారే. కానీ బవుమా స్పెషల్ ఇన్నింగ్స్, శుభమన్ గిల్ ఇంజ్యూరీ, స్పిన్ గేమ్ మొత్తాన్నే మార్చేశాయి. మ్యాచ్ విన్నర్ సైమన్ హార్మర్ భారత మీడియా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నాడు. 'మ్యాచ్ అయిపోయింది.. ఇంకేం మిగల్లేదు' అంటూ సౌతాఫ్రికా ఓటమిని ముందే ఖరారు చేసేశారని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. కానీ.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో గెలుపుకు 124 పరుగులు మాత్రమే అవసరముండగా, దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను కేవలం 93 పరుగులకే కూల్చేశారు. హార్మర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “భారత మీడియా ఈ మ్యాచ్ ముగిసిపోయిందని ముందే నిర్ణయించేసింది. మాకు మాత్రం ఒక భాగస్వామ్యం చాలు అనిపించింది. టెంబా బవుమా ఎలా బ్యాటింగ్ చేశాడో చూడండి, ఒక స్పష్టమైన ప్లాన్, అద్భుతమైన టెంపో. 150 దాటితే మ్యాచ్‌లోకి వస్తామని మా నమ్మకం. ఆ తరువాత మార్కో యాన్సన్ రెండు కీలక వికెట్లు తీస్తే, శుభమన్ ఆడకపోవడంతో భారత్ ఎఫెక్టివ్‌గా సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు నిజంగా మా చేతుల్లో అవకాశం ఉందని తెలిసింది. ప్రతి ఒక్కరూ పాత్ర పోషించారు. ఇది పూర్తి టీమ్ ఎఫర్ట్” అని వ్యాఖ్యానించాడు."మా మధ్య చర్చ ‘చిప్ అండ్ ఏ చైర్’ థియరీ గురించే. టేబుల్‌పై ఒక చిప్ ఉన్నప్పుడల్లా గెలిచే అవకాశాలు మీవే. మనస్సులో ఆ ఫలితాన్ని ఊహించుకోవడం, అది మరుసటి రోజు నిజం కావడం నిజంగా ప్రత్యేకమైన అనుభూతి. భారతదేశంలో ఇంతకుముందు ఎన్నో కఠిన ఫలితాలను ఎదిరించిన మా ప్లేయర్లకు ఈ విజయం మరింత ఆనందాన్ని ఇచ్చింది. అక్షర్ పటేల్ ఆ సిక్సులు కొట్టినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన శబ్దం చెవులు చిల్లులు పడేలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మా ప్రణాళికలు పనిచేయడం మా అదృష్టం” అని హార్మర్ చెప్పాడు.అంతేకాకుండా భారత్‌లో స్పిన్ బౌలింగ్ చేసే ప్రత్యేక అనుభవాన్ని కూడా హార్మర్ గుర్తు చేసుకున్నాడు. “ఒక ఆఫ్ స్పిన్నర్‌గా చిన్న చిన్న మార్పులు కూడా చాలా ప్రభావం చూపుతాయి. బ్యాటర్లతో పోటీలో ఉండటం నాకు ఎంతో ఇష్టం. ఇందుకు భారత ఉపఖండం కంటే మంచి స్థలం లేదు. ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్ ప్లేయర్లు భారత్‌లో ఉన్నారు. ఇక్కడ బౌలింగ్ చేయడం ఒక ప్రత్యేక సవాలు” అని హార్మర్ అన్నాడు.