సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది సామాన్యులు పాపులర్ అవుతున్నారు. తమలోని ప్రత్యేకమైన టాలెంట్‌తో కొందరు తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఓవర్ నైట్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. అలాంటి వారిలో ఒకరు . సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. ఈ అనూహ్యమైన గుర్తింపు ఆమెకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సుష్మా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటారు. పలు బ్రాండ్‌లకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీగా ఆమె వివిధ ఛానెళ్లకు, వేదికలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట్వర్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ఓ మూవీ డైరెక్టర్ తనను కమిట్‌మెంట్ అడిగాడని బాంబ్ పేల్చారు. అలాగే తన వీడియోలకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ చూసి గతంలో బాధపడేదానని..ఇప్పుడు పట్టించుకోవటం మానేసానని చెప్పుకొచ్చారు. తన పిల్లలు పెద్దవారు అవుతున్నారని.. వచ్చే రెండేళ్లలో వీడియోలు ఆపేస్తానని అన్నారు. 'నేను ఇన్‌స్టాలోకి వచ్చిందే ఓ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు. ఆ తర్వాత డబ్బు సంపాదనపై మనసు మళ్లింది. డబ్బును ఎవరు కాదనుకుంటారు. అందరూ ఆశాజీవులే కదా. కానీ ఈ నిజాన్ని బయట ఎవరూ ఒప్పుకోరు. నాకూ ఆశ పుట్టి ప్రమోషన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నా. నేను పాజిటివ్.. నెగిటివ్‌ను రెండూ యాక్సెప్ట్ చేస్తా. నాకు స్టార్టింగ్‌లో ఘోరమైన కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో అన్ని కామెంట్స్ చదివేదాన్ని.. ఫీలయ్యేదాన్ని. శారీలో హోమ్లీగా రీల్స్ చేసినా.. కామంట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేశా. కామెంట్స్ అస్సలు పట్టించుకోను. మా పిల్లలు నా కామెంట్స్ చూడరు. ముందే చెప్పా. నా ప్రొఫెషన్ ఇది.. ఇలాంటి కామెంట్స్ సాధారణం అని నోట్ పెట్టా. అందుకే వాళ్లు ఓ స్టేజీకి వచ్చాక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యా. ప్రస్తుతం మా పాప ఫోర్త్ క్లాస్.. బాబు 8th క్లాస్. మా పాపకు ఇంకో రెండు సంవత్సరాల్లో అన్నీ అర్థం చేసుకునే వయసు వస్తది. సో.. అప్పటిలోగా నేను వీడియోలు చేయటం ఆపేస్తా. ఆ తర్వాత.. ఏవో చిన్న చిన్న ప్రమోషన్స్.. హోమ్లీ క్యారెక్టర్ ఉన్నవి.. సరదా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా. పిల్లల ఫ్యూచర్‌కు ఎఫెక్ట్ కాకుండా.. వీడియోలు క్లోజ్ చేసేయటం బెస్ట్ అని డిసైడ్ అయ్యా. సో వచ్చే రెండేళ్లలో ఇప్పుడు చేస్తున్నటువంటి ఇలాంటి వీడియోలు పూర్తిగా ఆపేస్తా. రీసెంట్‌గా ఓ మూవీ డైరెక్టర్ కాల్ చేశాడు. మూవీలో ఛాన్స్ కావాలంటే కొన్ని ఉంటాయని అన్నాడు. సార్.. డెరెక్ట్‌గా చెప్పండి నాకు అర్థం కాలేదన్నా. నా భర్త ముందే ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడా.. ఇన్‌డెరెక్ట్‌గా కమిట్‌మెంట్ అడిగాడు. నా మనసు చంపుకొని అలాంటి పని చేయలేదని చెప్పాను. నా టార్గెట్ ఇల్లు. ఇప్పుడు బుద్వేల్‌లో ఖాళీ జాగా కొనుకున్నాం. త్వరలోనే ఇల్లు కట్టుకుంటాం. అంతే తప్ప ఇలాంటి పనులు చేయాల్సిన పనిలేదు.' అని సుష్మా భూపతి ఇంటర్వ్యూలో వెల్లడించారు.