రూ. 150 కోసం ప్రాణ స్నేహితుడు ఇలా చేస్తాడని అనుకోలేదు.. అయ్యో పాపం ఆ యువకుడు..

Wait 5 sec.

రూపాయి, రూపాయి.. నువ్వేం చేస్తావు అంటే.. తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుపెడతాను. అని రూపాయి చెప్పిందని పెద్దల మాట. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. రూ. 5 కోసం హత్యలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య రూ. 150 కోసం మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అనంతరం అందులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 35 ఏళ్ల చిరంజీవి విశాఖపట్నంలో నివాసం ఉంటున్నాడు. భార్యతో గొడవల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి.. స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవికి.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన లక్ష్మణ్‌రెడ్డి పరిచయం అయ్యాడు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఉంటున్నారు. అటుగా వెళ్లే దాతలెవనరైనా ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారు. చిరంజీవి, లక్ష్మణ్ రెడ్డి బుధవారం (నవంబర్ 19) మద్యం కొనుక్కుని డైమండ్ ‌పార్కులోకి వెళ్లారు. ఈ క్రమంలో రూ. 150 విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. నా జేబులో డబ్బులు లాక్కొంటావా.. అంటూ లక్ష్మణ్‌రెడ్డి.. చిరంజీవితో గొడవపడ్డాడు. మద్యం మత్తు ఎక్కేసరికి.. గొడవ తీవ్రమైంది. అనంతరం పక్కనే ఉన్న కర్రతో బలంగా చిరంజీవి తలపై కొట్టాడు లక్ష్మణ్. దీంతో చిరంజీవి ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పుడు పోలీసులకు ఓ చిక్కు వచ్చి పడింది. ఘటనా స్థలం ఎవరి పరిధిలోకి వస్తుందో.. ద్వారకా, నాలుగో పట్టణ స్టేషన్‌ అధికారులు తేల్చుకోలేకపోయారు. డైమండ్‌ పార్కు వద్ద ఉన్న సాయిరాం పార్లర్‌ వైపు నాలుగో పట్టణ స్టేషన్.. ఇంకో వైపు ద్వారకా స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. చిరంజీవి హత్య పార్కులో బెంచిపై జరగడం వల్ల.. మా పరిధి కాదంటే మా పరిధి కాదని పోలీసుల మధ్య చర్చ జరిగింది. దీంతో ఉన్నాధికారులు రంగంలోకి దిగి.. అది నాలుగో పట్టణ పరిధిగా నిర్ణయించారు. అనంతరం ఆ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లక్ష్మణ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు చిరంజీవిపై ఇప్పటికే గోపాలపట్నం, టూటౌన్‌ పరిధిలో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు చెప్పారు.