ఎంఎస్ ధోనీ ఎలైట్ లిస్ట్‌లో రిషభ్ పంత్.. 11 ఏళ్ల తర్వాత టెస్టు కెప్టెన్‌గా ఓ వికెట్ కీపర్ పగ్గాలు

Wait 5 sec.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శుభమన్ గిల్ మెడ గాయంతో సిరీస్ నుంచి దూరం కాగా, ఆ సారథ్య పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. దీంతో పంత్ 11 సంవత్సరాల తరువాత వికెట్‌ కీపర్‌గా భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న తొలి ఆటగాడిగా నిలవబోతున్నాడు. ఈ అరుదైన ఘనతను ఇంతకుముందు సాధించిన ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే.భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 0 - 1తో వెనుకబడింది. కోల్‌కతా వేదికగా జరిగిన మొదటి టెస్టులో 30 పరుగుల తేడాతో పరాజయం చెందిన నేపథ్యంలో, సిరీస్ సమం చేయడానికి గువాహటి టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన ఆటగాడిగా పంత్‌పై భారీ బాధ్యత పడింది. మొదటి టెస్ట్ సమయంలో శుభమన్ గిల్ రెండో రోజున మెడ నొప్పితో బాధపడి ఆస్పత్రికి వెళ్లాడు. ఆ వెంటనే డిశ్చార్జ్ చేసినప్పటికీ, ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకునే స్థాయిలో అతను లేడని బీసీసీఐ వైద్య బృందం భావించింది. గిల్ గువాహటికి జట్టుతో కలిసి వచ్చినప్పటికీ, వైద్యుల సూచనల మేరకు రెండో టెస్టులో ఆడకూడదని నిర్ణయించారు. గిల్‌కి రాబోయే వన్డే సిరీస్‌కు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశముందని సమాచారం.గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వం అప్పగించగా, ఇది అతని కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ. వికెట్‌కీపర్ కెప్టెన్‌గా భారత టెస్ట్ జట్టును నడిపించే రెండో ఆటగాడిగా పంత్ నిలవడం విశేషం. భారత జట్టు పునరాగమనం కోసం కీలకమైన ఈ మ్యాచ్‌లో పంత్ నాయకత్వం ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. "శుభమన్ గిల్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో రోజున మెడ గాయంతో బాధపడ్డాడు. ఆ రోజు ఆట ముగిసిన తరువాత ఆయన్ను ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. తరువాతి రోజున డిశ్చార్జ్ అయిన గిల్, చికిత్సకు మంచి స్పందన చూపుతున్నారు" అంటూ గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.