: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ కంపెనీ సీల్ మ్యాటిక్ ఇండియా లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై తమ వాటాదారులకు జారీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా ఈ బోనస్ షేర్ల రికార్డు డేట్ నిర్ణయించినట్లు తెలిపింది. నవంబర్ 21వ తేదీ ఈ కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేయనున్నాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత 6 నెలల్లో 15 శాతం నష్టపోయింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 2:10 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ నవంబర్ 21, 2025గా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. అంటే నవంబర్ 20వ తేదీ మార్కెట్లు ముగిసే లోపు షేర్లు కొన్నవారికి ఉచితంగా షేర్లు పొందేందుకు అవకాశం లభిస్తుంది. ట్రేడింగ్ సెషన్లో ఈరోజు మాత్రం 3.95 శాతం మేర పడిపోయింది. ఈ వార్త రాసే నాటికి రూ. 447.50 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 677.75, కనిష్ఠ ధర రూ. 355.50 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 6 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 10 శాతం నష్టాన్ని మిగుల్చింది. గత ఆరు నెలల్లో 19 శాతం పడిపోయింది. గత ఏడాదిలో 22 శాతం నష్టపోయింది. గత ఐదేళ్ల కాలంలో 74 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 423 కోట్లు వద్ద ఉంది. ఈ కథనం సమాచారం అందించేందుకే తప్పితే ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.