నా చేత కూడా అక్కా అనిపించుకోవడానికా.. సరిగమప షోలో రోజాకి పంచులు

Wait 5 sec.

సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న షోకి ఎస్పీ శైలజ, రచయిత అనంత శ్రీరామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జీలుగా ఉన్నారు. సుడిగాలి సుధీర్ ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు. ఇక ప్రతి వారం ఈ షోకి ఏదో ఒక హీరోయిన్‌ని గెస్టుగా తీసుకొస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌కి ఆర్కే రోజా వచ్చారు.ఇక సింగర్ వరుణవి పాటకి ఫిదా కాని వాళ్లు ఎవరూ లేరు. ఆడియన్స్ నుంచి గెస్టుల వరకూ అందరూ వరుణవి ముద్దు ముద్దు మాటలకి, పాటలకి మురిసిపోతుంటారు. తాజాగా రోజా కూడా వరుణవి మాటలకి, పాటకి ఫిదా అయిపోయారు. ఇంత బాగా మాట్లాడుతున్నావ్ కదా డ్రామా జూనియర్స్‌కి వస్తావా.. అని రోజా అడిగారు.అక్కా అని పిలిపించుకోవడానికాదీనికి ఎందుకు అక్కా అని పిలిపించుకుందామనా.. అంటూ పంచ్ వేసింది వరుణవి. ఈ మాటకి రోజా బిత్తరపోయి.. నీకు బాగా మాటలొస్తున్నాయ్ ఎవరు నేర్పిస్తున్నారు.. అని అడిగారు. మాటలైనా పాటలైనా మా అమ్మే నేర్పించింది.. అంటూ 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలోని నీవే నీవే సాంగ్ పాడింది వరుణవి.ఎంత బాగా పాడావ్ నాన్న.. భగవంతుడు అందరి ఇళ్లల్లో ఉండలేడు కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఒక తల్లిని ఉంచారంట.. అంటూ రోజా అన్నారు. ఒక బిడ్డని కనాలంటే తల్లి యుద్ధం చేయాలి.. ఆ బిడ్డని పెంచాలంటే కూడా యుద్ధం చేయాలి.. అలాంటి యుద్ధం మీరు రోజూ చేస్తున్నారు.. అంటూ స్టేజ్ మీదకి వరుణవి తల్లిని పిలిచి అనిల్ రావిపూడి సత్కరించారు.ప్రపంచంలో కెల్లా తల్లి గొప్పది.. భూమి ఎంత గొప్పదో తల్లి అంత గొప్పది.. అంటూ శైలజ అన్నారు. ఈ షోలో వరుణవి ఎప్పుడు పాడినా సరే ఆడియన్స్ నుంచి కూడా అంతే రెస్పాన్స్ వస్తుంటుంది. సుడిగాలి సుధీర్-వరుణవి కూడా కలిసి ఒకసారి పాట పాడారు. సుధీర్‌ని మామ అంటూ ప్రేమగా పిలుస్తుంది వరుణవి. ఇటీవల ముగిసిన డ్రామా జూనియర్స్ షోలో అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్, రోజా ముగ్గురూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ముగ్గురు సరిగమపలో సందడి చేశారు.మొన్నటి వరకూ రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా ఇప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తున్నారు. తమ పార్టీలో పవర్‌లో లేకపోవడం, రోజా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న కొన్ని టీవీ షోలలో రోజా సందడి చేస్తున్నారు. డ్రామా జూనియర్స్, ఫెస్టివల్ ఈవెంట్స్‌లో రోజా కనిపిస్తున్నారు.