అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల అయ్యారు. కోసం బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలు కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆటోలో కవిత చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట అనంతరం కవిత సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను కేవలం సింగరేణికి మాత్రమే కేటాయించాలని పేర్కొన్నారు. ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యమని తెలిపారు.సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని ఆరోపించిన కల్వకుంట్ల కవిత.. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను నిలిపివేయాలని.. తద్వారా కార్మికులపై ఆర్థిక భారం తగ్గుతుందని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం తెలంగాణ జాగృతిగా తాము పోరాటం చేస్తున్నామని.. ఇది కార్మికుల ఆరోగ్యానికి అత్యవసరమని కల్వకుంట్ల కవిత తెలిపారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను తీసివేయడం దారుణమని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కవిత తీవ్రంగా హెచ్చరించారు. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కల్వకుంట్ల చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం నిర్వహించనున్న ఈ యాత్ర ప్రతీ జిల్లాలో 2 రోజుల చొప్పున జరగనుంది. మొత్తం 4 నెలల్లో తెలంగాణ అంతటా ఈ యాత్ర సాగనున్నట్లు జాగృతి నేతలు స్పష్టం చేశారు.