ఆడ పిల్లల పేరుపై రూ.3.25 లక్షల కోట్లు జమ.. పీఎం మోదీ కీలక ప్రకటన.. ఈ స్కీమ్‌తో సూపర్ బెనిఫిట్స్

Wait 5 sec.

: ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా పదేళ్ల లోపు వయసు గల ఆడ పిల్లల పేరుపై 4 కోట్లకు పైగా సుకన్య యోజన ఖాతాలు తెరిచారని, వాటిల్లో ఇప్పటి వరకు రూ.3.25 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు చేసినట్లు వెల్లడించారు. భారతీయ సంప్రదాయంలో ఆవులను జీవితం, శ్రేయస్సు, కరుణకు చిహ్నంగా పరిగణిస్తారని అన్నారు. ఎందుకంటే అవి ఈ కుటుంబాల ఆర్థిక, పోషక, సామాజిక శ్రేయస్సుకు సహాయ పడతాయన్నారు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి ప్రధాని మోదీ చెప్పిన వివరాలు తెలుసుకుందాం. 'పదేళ్ల క్రితం ఆడ పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించడం, విద్య కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా మన కుమార్తెలకు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఇప్పటి వరకు సుకన్య సమృద్ధి యోజన కింద 4 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. ఆయా బ్యాంకు అకౌంట్లలో 3.25 లక్షల కోట్లకుపైగా రూపాయలు జమ చేశారని తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు.' అని ప్రధాని మోదీ అన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్య సాయి బాబాకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.ఆయన బోధనలు, సేవలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుచరులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గురువు జ్ఞాపకార్థం రూ.100 నాణెం, పలు స్టాంపులను కూడా పీఎం మోదీ విడుదల చేశారు.సుకన్య సమృద్ధి యోజన వివరాలుపది సంవత్సరాల ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. అమ్మాయిల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ స్కీమ్ ద్వారా మంచి వడ్డీ రేటు కల్పిస్తున్నారు. ఇందులో కనీస పెట్టుబడి రూ.250 ఉండగా గరిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. 21 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్, అత్యధిక వడ్డీ, పాక్షిక విత్ డ్రా వంటివి లభిస్తాయి. పాప తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఒక పాప పేరుపై ఒకే అకౌంట్ ఉండాలి. పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. పాప 10వ తరగతి తర్వాత లేదా 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఉన్నత విద్య కోసం 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తే అకౌంట్ క్లోజ్ చేసి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 8.20 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది.