శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లపై కీలక ప్రకటన చేసింది. తిరుపతిలోని వద్ద ఈ హోమం నిర్వహిస్తారు. అయితే పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వరకు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే అలిపిరిలో నిర్వహించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. సహకరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు తిరుమలలో సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. టటటీటీడీకి భారీ విరాళంమరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం వచ్చింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళంగా అందింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు‌కు చెందిన భక్తుడు ఈ విరాళం అందించారు. డార్లింగ్ క్లాసిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంస్థ డైరెక్టర్ మురళి వెంకటసుబ్బు బుధవారం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు పది లక్షల రూపాయలు విరాళంగా సమర్పించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలుతిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు విహరించారు. ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. వాహన సేవ సందర్భంగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.మరోవైపు ముత్యపు పందిరిపై విహరించే అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.బ్రహ్మాత్సవాల్లో భాగంగా బుధవారం పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు,