దర్శనాలు ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు.. శబరిమలకు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఉంటాయి.. ఎటు వైపు నుంచి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భక్తులకు శబరిమలలో తీవ్ర అవమానకర సంఘటన ఎదురైంది. ఈ ఘటనపై స్పందించిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు.. తాజాగా శబరిమలకు వెళ్లగా.. దర్శనం కోసం క్యూలైన్ ఎక్కడ అని అడిగినందుకు అక్కడ ఉన్న ఓ కేరళ పోలీస్ అధికారి అసభ్య చేష్టలకు దిగాడు. తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేసినట్లు ఆ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఆ పోలీస్ అధికారి చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ పోలీస్ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు.. శబరిమల యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన స్వాములతో అక్కడి పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని వస్తున్న వార్తలు, వీడియోల ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి అయ్యప్ప స్వాములు వస్తే.. వారితో పోలీసులు ఇలా దురుసుగా వ్యవహరించడం అంగీకరించే విషయం కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాములతో అనుచితంగా ప్రవర్తించిన కేరళ పోలీసుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాజీ సింగ్ డిమాండ్ చేశారు.ప్రత్యేక కోఆర్డినేటర్ నియామకంపై సీఎంలకు రాజాసింగ్ విజ్ఞప్తిప్రతీ సంవత్సరం కేరళలో జరిగే మండల, మకరవిళక్కు పూజల కోసం దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో.. వారికి అన్ని సౌకర్యాలు, మార్గదర్శనం అందించేందుకు ప్రత్యేకంగా ఒక కో ఆర్డినేటర్‌ని నియమించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు.. శబరిమలలో భాషకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారికి సహాయ పడేందుకు ఈ కోఆర్డినేటర్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు.