టెక్ కంపెనీ వివాదాస్పద నిర్ణయం.. ఐటీ ఉద్యోగులకు శాపం.. 5 నిమిషాలు కూడా..!

Wait 5 sec.

IT Employees: ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజాలలో ఒకటైన టెక్నాలజీ సొల్యూషన్స్ () ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగుల పని తీరును అతి సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించేందుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో పని చేసే ఐటీ ఉద్యోగులపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఆయా సిబ్బంది ల్యాప్‌టాప్ కార్యకలాపాలు, మౌస్ లేదా కీబోర్డ్ కదలికలు, వారు సందర్శించే వెబ్‌సైట్లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక ప్రోహాన్స్ () వంటి వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తోందట. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా ఉద్యోగుల ప్రతి కదలికపై నిఘా పెట్టే నిర్ణయం సరికాదని ఐటీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతను, స్వేచ్ఛను హరించేదిగా ఉందని, వారిపై కంపెనీకి నమ్మకం లేదని సూచించేదిగా ఉందని పేర్కొంటున్నారు. కాగ్నిజెంట్ అంతర్గత శిక్షణా మాడ్యూళ్ల ప్రకారం ఈ కొత్త నిఘా విధానం ద్వారా ఉద్యోగుల కార్యకలాపాలను కొలిచేందుకు నిర్దిష్ట ప్రమాణాలు నిర్ణయించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా మౌస్ లేదా కీబోర్డ్ కదలికలు లేకుండా 5 నిమిషాలు గడిస్తే ఆ ఉద్యోగి నిష్క్రియం (Idle) (పని చేయడం లేదని) పరిగణిస్తారు. అయితే, ప్రోహాన్స్ సాఫ్ట్‌వేర్ వంటి వాటితో ట్రాక్ చేసిన డేటాను ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు మదింపు కోసం ఉపయోగించబోమని కాగ్నిజెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. మైక్రో ట్రాకింగ్ అనేది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ఉత్పాదకత, స్వేచ్ఛకు తీవ్రమైన నష్టం కలిగించే చర్యగా విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఈ మేరకు కంపెనీ స్పందించినట్లు సమాచారం. అయితే, అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు నిరంతరం తమపై ఎవరో నిఘా పెడుతున్నారనే ఒత్తిడికి లోనవుతారని ఐటీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌస్ కదలకుండా ఉంటుందేమోనని భయపడి చిన్న విరామం సైతం తీసుకోవడానికిసైతం సంకోచిస్తారని అంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు, క్రిటికల్ వెబ్‌సైట్లను ట్రాక్ చేయడం ద్వారా వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఉద్యోగులపై నమ్మకం ఉంచకుండా కేవలం ల్యాప్ టాప్ కదలికలను బట్టి వారి పనితీరును అంచనా వేయడం అనేది కార్పొరేట్ నైతికతకు విరుద్ధమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కొత్త నిఘా విధానం రిమోట్ వర్క్ కల్చర్‌లో కంపెనీ- ఉద్యోగుల సంబంధాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.