డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 నెలలుగా స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో.. ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet) సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన తర్వాతే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో కొత్త సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం.. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.బీసీ రిజర్వేషన్ల పీటముడి.. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల అంశమే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ రాజకీయ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంలో సమస్యలు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అనే నియమం ఇక్కడ అడ్డు తగులుతోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని.. అయితే పార్టీ పరంగా మాత్రం 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని గతంలో నిర్ణయించింది. ఈ న్యాయపరమైన అంశాలను పరిష్కరించడానికి కొంత సమయం అవసరమైంది.మొదట సర్పంచ్‌ల ఎన్నికలు..ఈ ఆలస్యం కారణంగా.. ప్రభుత్వం ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మొదట సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.స్థానిక సంస్థల పాలకవర్గాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో, మండలాల్లో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. కాబట్టి.. తాజా కేబినెట్ నిర్ణయంతో డిసెంబర్ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో.. ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా.. సౌదీలో మృతి చెందిన అందించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించడానికి.. బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపాలని నిర్ణయించింది. మృతదేహాలకు అక్కడే.. వారి మత సంప్రదాయం ప్రకారం ఖననం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బాధిత కుటుంబాల నుంచి ఇద్దరి చొప్పున కుటుంబ సభ్యులను సౌదీకి ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.