ఏపీ ప్రభుత్వం శుభవార్త.. విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు అందించే వంట ఛార్జీలను పెంచుతూ మధ్యాహ్న భోజనం, పాఠశాల పారిశుద్ధ్య విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన ఛార్జీలు ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఛార్జీలు పెంచుతూ, ఆగస్టు 8 నుంచి అమలు చేయనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.5.45 ఇస్తుండగా, దానిని రూ.6.19కి పెంచారు. అలాగే 6 నుంచి 8వ తరగతి వరకు రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. ఈ పెంచిన ఛార్జీల నుంచి అదనపు మెనూ కింద ఇచ్చే రూ.0.43 (1-5 తరగతులు), రూ.0.40 (6-8 తరగతులు)ను మినహాయించనున్నారు. ఇక తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.8.17 ఛార్జీలను రూ.9.29కి పెంచారు. ఈ ఛార్జీలు ఆగస్టు 8 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి నుంచి కూడా అదనపు మెనూ కింద ఇచ్చే రూ.0.40ను మినహాయించనున్నారు. ఈ నిర్ణయంతో మరింత నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంది.ఆర్వో ప్లాంట్లపై మంత్రి ఆదేశాలుబీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాలు, వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.16.85 కోట్లు 922 బీసీ వసతిగృహాలకు, రూ.3.44 కోట్లు 55 గురుకులాలకు విడుదల చేసింది. విద్యార్థులకు సురక్షిత నీరు అందించడంలో జాప్యం జరగకూడదనన్నారు మంత్రి సవిత. ఈ ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో బీసీ విద్యార్థులు స్వచ్ఛమైన నీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టుల అమలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.హడ్కో రుణంఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల అభివృద్ధి పనులకు హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌)కు రూ.75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీఏడీసీఎల్‌ ఎండీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. మరమ్మతులు, బెడ్స్‌ కొనుగోళ్లకు రూ.19.60 లక్షలు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.