తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. చేరుకుంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో శనివారం రాత్రి అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డయింది.పశ్చిమ, ఉత్తర 6 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉన్న తీవ్రమైన చలి కంటే మరింత బలంగా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఆదివారం ఉదయం హెచ్‌సీయూ శేరిలింగంపల్లి ప్రాంతంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాబోయే రెండు రోజులు నగరంలో 8-10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. శివారు ప్రాంతాలు, పచ్చదనం అధికంగా ఉన్న చోట్ల ఉదయం పూట దట్టమైన పొగమంచు అలముకుంటుందని చెప్పారు. 10 జిల్లాల్లో అత్యంత చలిరాబోయే రెండు రోజుల పాటు అత్యంత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నందున.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6- 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి సాధారణం కంటే అధికంగానే ఉంటుందని చెప్పారు. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని, రాత్రిపూట, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.