2 రోజులు భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు.. మంచి ఛాన్స్.. ఇవాళ 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారానికి ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. ఇక పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న సమయంలో అయితే డిమాండ్ ఫుల్‌గా ఉంటుంది. జువెలరీ దుకాణాలు కొనుగోలుదారులకు కిక్కిరిసిపోతుంటాయి. ఈ ఏడాది 2025లో ఊహించని విధంగా పెరిగాయి. అయినప్పటికీ గిరాకీ మాత్రం తగ్గలేదని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, అమెరికా సుంకాల నిర్ణయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, గిరాకీ, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ ఇలా అనేక కారణాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా అనూహ్య నిర్ణయాలు ఇప్పటికీ బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. దీంతో ధరలు రికార్డ్ గరిష్ఠాల వద్దే ట్రేడవుతున్నాయి. ఈరోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 17వ తేదీన 22, 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ఎలా ఉందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఔన్సుకు క్రితం రోజు 100 డాలర్ల మేర పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 16 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ రేటు 4089 డాలర్ల వద్దకు చేరుకుంది. అయితే, 0.06 శాతం తగ్గి 50.87 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రెండ్రోజుల్లో తులానికి రూ.3500లకు పైగా తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,25,080 వద్దకు దిగివచ్చి ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు భారీగా తగ్గి ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది. రూ.4000 తగ్గి స్థిరంగా వెండిబంగారంతో పాటు వెండి సైతం క్రితం రోజు భారీగానే తగ్గింది. కిలోపై రూ.4100 మేర పడిపోయిన సిల్వర్ ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,75,000 వద్ద ట్రేడవుతోంది. అయితే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో కిలో వెండి రేతు రూ.1,69,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు నవంబర్ 17వ తేదీ ఉదయం 7 గంటల టైంకి ఉన్నవి. అయితే బులియన్ మార్కెట్లో మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. స్థానికంగా రేట్లు తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.