: బంగారం కొనుగోలు చేసే వారికి అలర్ట్. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులు వరుసగా భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు ఇవాళ సడెన్‌గా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఔన్స్ గోల్డ్ ధర సుమారు 50 డాలర్ల వరకు దిగివచ్చింది. ఈ ప్రభావం దేశీయంగానూ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్ విలువలో మార్పు, ఫెడ్ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక అంశాల వంటివి బంగారం ధరల్లో మార్పునకు కారణమవుతుంటాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినా దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం రేట్లు ఇవాళ స్వల్పంగా పెరగడం గమనార్హం. అయితే, మాత్రం రూ.2000 మేర పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన బంగారం ధర.. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగానే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు చూసుకుంటే ఇవాళ 47 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 4034 డాలర్ల స్థాయికి తగ్గి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 1.31 శాతం మేర పడిపోయి 49.96 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరహైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండు రోజులు తగ్గి ఇప్పుడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు బులియన్ మార్కెట్లో స్వల్ప మార్పు కనిపించింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.320 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,25,400 వద్దకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.300 పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,14,950 వద్దకు చేరుకుంది. రూ.2000 మేర తగ్గిన వెండి రేటుఈరోజు వెండి ధర కిలోకు రూ.2000 మేర పడిపోయింది. దీంతో కిలో రేటు రూ. 1,73,000 వద్దకు దిగివచ్చింది. అయితే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కిలో వెండి రేటు రూ.1,67,000 వద్ద లభిస్తుండడం గమనార్హం. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు నవంబర్ 18వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి గోల్డ్ రేట్లు మారవచ్చు. అలాగే ట్యాక్సులు, ఇతర ఛార్జీలు కలిపితే ప్రాంతాల వారీగా గోల్డ్ రేట్లు వేరు వేరు ఉంటాయి. కొనే ముందు స్థానికంగా తెలుసుకోవడం మంచిది.