SBI : మనకు పెట్టుబడులు చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా ఎన్నో ఉంటాయి. వీటిల్లో రిస్క్ ఉన్నవి ఉంటాయి. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి. రిస్క్ ఉన్న వాటిల్లో.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ రిటర్న్స్ దీర్ఘకాలంలో ఎక్కువగానే ఉంటాయి కానీ గ్యారెంటీ రిటర్న్స్ ఆశించలేం. గోల్డ్, రియల్ ఎస్టేట్.. ద్రవ్యోల్బణాన్ని మించేలా రాబడి ఇవ్వకపోవచ్చు. ఇక పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిల్లో నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. సంప్రదాయ పెట్టుబడిదారులు.. రిస్క్ వద్దని ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ పెట్టుబడి సురక్షితం. గ్యారెంటీగా వడ్డీ రేట్లకు తగ్గట్లుగా రాబడి వస్తుంది. ఎంత జమ చేస్తే.. ఎంత కాలానికి.. కచ్చితంగా ఎంత వస్తుందో మనం వడ్డీ రేట్లను బట్టి ముందుగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మార్కెట్లో ఎన్నో FD కాలిక్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. >>. ఉదాహరణకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నా కూడా.. టెన్యూర్ మొత్తానికి చూస్తే పెద్ద మొత్తంలో తేడా రావొచ్చు. మీరు ఉదాహరణకు రూ. 10 లక్షల డిపాజిట్‌.. మూడేళ్లకు చేస్తే 50 బేసిస్ పాయింట్లు వడ్డీ ఎక్కువగా ఉంటే.. అదనంగా రూ. 15 వేలు పొందొచ్చు. ఇలా వడ్డీ రేటులో కొద్ది తేడా ఉన్నా.. దీర్ఘకాలంలో ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంటుంది. దేశంలోని టాప్- 7 బ్యాంకుల్లో 3 సంవత్సరాల డిపాజిట్ వడ్డీ రేట్లు చూద్దాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వడ్డీ రేటు మూడేళ్ల ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 6.45 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతంగా ఉంది. ఇక్కడ రూ. 2 లక్షలు జమ చేస్తే.. సాధారణ ప్రజలకు వడ్డీ రూ. 42,324 వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు రూ. 45,925 వడ్డీ అందుతుంది. ఐసీఐసీఐ బ్యాంకులో వడ్డీ రేట్లు వరుసగా 6.6 శాతం, 7.2 శాతంగా ఉండగా.. రూ. 2 లక్షల డిపాజిట్‌పై రూ. 43,399; రూ. 47,744 వడ్డీ వస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో వడ్డీ రేట్లు వరుసగా 6.4 శాతం, 6.9 శాతంగా ఉండగా.. 2 లక్షలపై రూ. 41,966; రూ. 45,563 వడ్డీ వస్తుంది. ఫెడరల్ బ్యాంకులో మూడేళ్ల డిాపాజిట్‌పై సాధారణ ప్రజలకు 6.7 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.20 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. రూ. 2 లక్షలపై రూ. 44,118; రూ. 47,744 వడ్డీ అందుతుంది. మూడేళ్ల డిపాజిట్‌పై ఎస్బీఐ చాలా తక్కువ వడ్డీ ఉంది. ఇక్కడ సాధారణ ప్రజలకు 6.3 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.8 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. రూ. 2 లక్షలపై ఇక్కడ వరుసగా రూ. 41,253; రూ. 44,839 వడ్డీ వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.6 శాతం, 7.10 శాతం వడ్డీ రేట్లు రూ. 2 లక్షలపై వరుసగా రూ. 43,399; రూ. 47,015 వడ్డీ వస్తుంది.