కొత్త రియల్ ఎస్టేట్ హబ్.. హైదరాబాద్‌లో ఈ ప్రాంతానికి ఫుల్ డిమాండ్.. చ.అడుగు రూ. 10 వేలలోపే!

Wait 5 sec.

: హైదరాబాద్ నగరం చెప్పొచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో ఇప్పటికే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండపూర్ ఇలాంటి ప్రాంతాలు వృద్ధి చెందగా ఇప్పుడు మరికొన్ని ప్రాంతాలు కూడా కొత్త కొత్త హబ్‌లుగా అవతరిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే అంతర్భాగంగా ఉన్నటువంటి కూకట్‌పల్లి ప్రాంతం కూడా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటిగా ఉంది. ఒకానొక దశలో ఈ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేయాలంటే.. చదరపు అడుగుకు రూ. 1 లక్షకుపైనే వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు నిర్మాణ కార్యకలాపాలు జోరందుకుంటుండటంతో కూకట్‌ పల్లి రియల్ ఎస్టేట్‌కు కొత్త అడ్డాగా మారింది. కూకట్ పల్లి, దాని పరిసర ప్రాంతాలైన , మూసాపేటలో ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. ఒక దశలో ఈ ప్రాంతంలో నివాస స్థలాలు దొరకడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఖాళీ భూముల్లో బడా రియల్టర్లు.. నివాస సముదాయాల్ని విస్తరిస్తున్నారు. ఒకవైపు 12-24 అంతస్తుల వరకు స్కై రైజ్ అపార్ట్‌మెంట్స్ (ఆకాశహర్మ్యాలు) రూపుదిద్దుకుంటుండగా.. ఇంకోవైపు విల్లాలు కూడా వెలుస్తున్నాయి. వై జంక్షన్ మొదలుకొని.. ఆంజనేయనగర్, మూసాపేట, ఐడీఎల్ రోడ్, కైత్లాపూర్ రోడ్డు వరకు పెద్ద పెద్ద నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రంగధాముని చెరువు అలుగు నుంచి సైబర్ సిటీ చౌరస్తా మీదుగా సఫ్దర్ నగర్ రోడ్ వరకు పదుల కొద్దీ ప్రాజెక్టులు వస్తున్నాయి. గతంలో అధిక ధరల నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో వీరికి కూడా అందుబాటు ధరల్లో విక్రయాలు కనిపిస్తున్నాయి. 15-24 అంతస్తుల అపార్ట్‌మెంట్స్‌లో చ.అడుగు ధర రూ. 7-10 వేలల్లోనే ఉండటం విశేషం. నివాసితుల కోసం ఈ ప్రాజెక్టుల్లో ఇంకా క్రీడా ప్రాంగణాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్, గెస్ట్ హౌసెస్, మినీ ఫంక్షన్ హాల్స్, జిమ్, గెస్ట్ పార్కింగ్ ఇలా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాల్ని కల్పిస్తున్నారు. ఇక్కడ కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ ఉండటానికి ప్రధాన కారణం.. మౌలిక సదుపాయాలు, నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లగలిగేలా ఉండటం అని చెప్పొచ్చు. జాతీయ రహదారికి దగ్గర్లో ఉండటం, విశాల రహదారులు, సమీపంలోనే మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్ ఉండటం ఒక కారణం. కూకట్ పల్లి నుంచి ఐటీ హబ్ హైటెక్ సిటీకి అరగంటలోనే చేరుకునే అవకాశం ఉంది దీంతో ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇళ్ల కొనుగోళ్లకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్లు చెబుతున్నారు. స్థానికంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాాయలు కూడా విస్తృతంగా ఉండటం కలిసొస్తుంది.