టాటా స్టాక్ అదుర్స్.. 8 వారాలుగా లాభాల్లోనే.. ఇన్వెస్టర్లకు రూ. 51 వేల కోట్ల లాభం!

Wait 5 sec.

Stock Market Updates: దేశంలోని అత్యంత విశ్వసనీయ సంస్థల్లో టాటా గ్రూప్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇది దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తుందని చెప్పొచ్చు. ఉప్పు నుంచి విమానయానం ఇలా అన్ని రంగాల్లో ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్స్, టాటా స్టీల్, టాటా టెక్నాలజీస్, టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్ మాత్రమే కాకుండా టైటాన్, ట్రెంట్, తేజస్ నెట్‌వర్క్స్, వోల్టాస్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చెప్పొచ్చు. గరిష్ట స్థాయిల నుంచి వరుసగా పతనం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని చెప్పొచ్చు.ఇదే సమయంలో టాటా గ్రూప్ నుంచి ఒక స్టాక్ మాత్రం పరుగులు పెడుతోంది. అదే జువెల్లరీ, వాచెస్, ఐవేర్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న టైటాన్ లిమిటెడ్. మిగతా టాటా గ్రూప్ స్టాక్స్‌కు భిన్నంగా ఇది వరుస సెషన్లలో దూసుకెళ్తూ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఇటీవలి కాలంలో లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్‌ నమోదు చేసింది. శుక్రవారం సెషన్‌లో ఫ్లాట్‌గా ఈ షేర్ ధర రూ. 3,902.10 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో ఆ వారంలో అది సుమారు 2 శాతం పుంజుకుంది. దీంతో మరో వారమూ లాభాలు నమోదు చేసినట్లయింది. ఒకటి, రెండు వారాలు కాదు.. వరుసగా 8వ వారంలోనూ ఈ స్టాక్ దూసుకెళ్లడం విశేషం. ఇటీవలి కాలంలో ఇదే రికార్డు. ఈ 8 వారాల వ్యవధిలో చూస్తే 18 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మార్కెట్ విలువ ఈ క్రమంలో 8 వారాల్లో రూ. 51 వేల కోట్లకుపైగా పెరిగింది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఈ మేర పెరిగిందని చెప్పొచ్చు.ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 3,956 గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర చూస్తే రూ. 2,925 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 3.46 లక్షల కోట్లుగా ఉంది. దీంతో టాటా గ్రూప్‌లో మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. 6 నెలల్లో ఈ స్టాక్ ధర 10 శాతానికిపైగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 శాతం పెరిగింది. ఐదేళ్లలో చూస్తే 186 శాతం పుంజుకుంది. ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో టైటాన్ అదరగొట్టింది. అనలిస్టుల అంచనాల్ని కూడా మించిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో.. వార్షిక ప్రాతిపదికన నికర లాభం 59 శాతం పెరిగి రూ. 1120 కోట్లుగా నమోదైంది. ఆదాయం 22 శాతం పెరిగి రూ. 16,649 కోట్లుగా ఉంది.